సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సముద్రమట్టం నుంచి సగటున 0.9 కి.మీ. ఎత్తులో ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. శుక్రవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతాయని, శని, ఆదివారాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కాస్త తక్కుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్, నల్లగొండలో 24.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ చెప్పింది. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం అత్యధికంగా జగిత్యాల జిల్లా గొదురులో 44.2 డిగ్రీ సెల్సియస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.1 డిగ్రీ సెల్సియస్, ములుగు జిల్లా లక్ష్మి దేవిపేటలో 43.9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment