మరోసారి క్లీన్ స్వీప్ దిశగా వైఎస్సార్‌సీపీ
గత ఎన్నికల్లో 49 శాసనసభ,8 లోక్‌సభ స్థానాల్లో విజయం
సీఎం జగన్ సుపరిపాలనతో రాయలసీమ ప్రజల్లో మరింతగా పెరిగిన ఆదరణ
స్థానిక సంస్థలు, తిరుపతి లోక్‌సభ, బద్వేలు శాసనసభ స్థానం ఉప ఎన్నికల్లో రికార్డు విజయం
గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన హిందూపురం, ఉరవకొండ, కుప్పంలోనూ స్థానిక సంస్థల్లో ఆధిపత్యం
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ, మైనారీ్టలకు పెద్దపీట
కూటమిని కుదేలు చేసిన రాప్తాడు సిద్ధం సభ, బస్సు యాత్ర, ప్రచార సభలు
ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం.. టీడీపీ ఆవిర్భావం నుంచి గెలుస్తూ వస్తున్న హిందూపురంలో ఈసారి సై‘కిల్’ గల్లంతే
ఉరవకొండలో పయ్యావులకు ఎదురుగాలి
కుప్పంలో పోటాపోటీ.. బాబు వెన్నులో వణుకు
సాక్షి, అమరావతి: రాయలసీమలో ఫ్యాన్ గాలి ప్రచండంగా వీస్తోంది. ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచి్చన పిలుపునకు ‘సీమ’ ప్రజలు పిడికిలి బిగించి సిద్ధం.. సిద్ధం.. అంటూ ప్రతిస్పందిస్తున్నారు. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు జనం బ్రహ్మరథం పడుతుంటే.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి నిరాశ ఎదురవుతోంది.
వీటిని పరిగణనలోకి తీసుకుంటే సార్వత్రిక ఎన్నికల్లో సీమలోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లోని 52 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సీమలో 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాలను చేజిక్కించుకుంది. హిందూపురం, ఉరవకొండ, కుప్పంలలో మాత్రమే టీడీపీ గెలిచి ఉనికి చాటుకుంది.
సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనకు పట్టం
గత 59 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ నాయకత్వంపై సీమ ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచిన సీఎం జగన్.. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. తెలుగు గంగ ప్రధాన కెనాల్‌కు లైనింగ్‌ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి.. మట్టికట్ట లీకేజీలకు డయాఫ్రమ్ వాల్‌తో అడ్డుకట్ట వేసి బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేశారు. కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కుందూ వరదను ఒడిసిపట్టి దుర్భిక్ష సీమను సస్యశ్యామలం చేశారు.
కృష్ణా జలాలపై సీమ హక్కులను పరిరక్షించేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిన సీఎం జగన్.. వరదను ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపేందుకు కరవు నివారణ ప్రణాళిక కింద కాలువలు, ఎత్తిపోతల సామర్థ్యం పెంచే పనులు చేపట్టారు. ఇది స్థానిక సంస్థల (పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్) ఎన్నికల్లో ప్రస్ఫుటితమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించింది. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన కుప్పం, హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధితపత్యాన్ని సాధించింది.
రాప్తాడు ‘సిద్ధం’ సభతో ఖాయమైన వైఎస్సార్‌సీపీ విజయం
ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి రాప్తాడులో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభకు సీమ ప్రజలు ఊళ్లకు ఊళ్లు కదలివచ్చారు. ఉమ్మడి, తెలుగు రాష్ట్రాల చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా రాప్తాడు సిద్ధం సభ నిలిచింది. ఈ సభ వేదికగా ఎన్నికల్లో సీమలో వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ప్రజానీకం చాటిచెప్పారు. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు కెరటాల్లా జనం పోటెత్తితే.. మలి విడత ప్రచారంలో సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు జనసముద్రాలను తలపిస్తున్నాయి.
ప్రధాని మోదీ, అమిత్ షాలను రప్పించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన కూటమి సభలు జనం లేక వెలవెలబోయాయి. ప్రచారంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఇంటింటా జనం బ్రహ్మరథం పడుతుంటే.. కూటమి అభ్యర్థులకు ప్రజలు మొహం చాటేస్తున్నారు. ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయనడానికి ఇదే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఆ మూడు స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం ఖాయం
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిన 49 శాసనసభ, ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో ఈ ఎన్నికల్లో విజయం నల్లేరుపై నడకే. సొంతూరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 1985 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు.. 1989 ఎన్నికల్లో కుప్పానికి వలస వెళ్లారు. అప్పటి నుంచి దొంగ ఓట్లు, దౌర్జన్యాలు, నోట్ల కట్టలు వెదజల్లి గెలుస్తూ వస్తున్నారు. అలాంటి చంద్రబాబు కోటను స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బద్ధలు చేసింది. కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేసి కుప్పానికి సీఎం జగన్ కృష్ణా జలాలను తరలించడంతో ఆ నియోజకవర్గ ప్రజల్లో సింహభాగం వైఎస్సార్‌సీపీకి మద్దతు పలుకుతున్నారు.
దాంతో చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్ మధ్య పోటీ నువ్వా–నేనా అన్నట్లు సాగుతోంది. కుప్పంలో ఈసారి వైఎస్సార్‌సీపీ పతాకం ఎగరడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ గెలుస్తూ వస్తున్న హిందూపురంలో ఈసారి సైకిల్ గల్లంతు కానుంది. హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభకు పోటెత్తిన జనసంద్రమే అందుకు తార్కాణం. టీడీపీ అభ్యరి్థ, సిటింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైఎస్సార్‌సీపీ అభ్యరి్థ, బీసీ వర్గానికి చెందిన దీపిక విజయం సాధించడం ఖాయం. ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఎదురుగాలి తీవ్రంగా వీస్తోంది. ఆ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వై.విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారీ్టతో విజయం సాధించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేíÙస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment