North America Telugu Society Will Conducting Balala Sambaralu - Sakshi
Sakshi News home page

నాట్స్‌ ఆధ్వర్యంలో బాలల సంబరాలు

Published Tue, Nov 30 2021 2:26 PM | Last Updated on Tue, Nov 30 2021 2:44 PM

NATS Will Conducting Balala Sambaralu - Sakshi

నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ ఆధ్వరం‍్యలో అమెరికాలో బాలల సంబరాలు నిర్వహించనున్నారు. 2021 డిసెంబరు 4వ తేదిన డల్లాస్‌లో ఈ వేడుకలు జరపబోతున్నట్టు నాట్స్‌ పేర్కొంది. ఏడు నుంచి 18 ఏళ్లలోపు ఉన్న పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొనడానికి అర్హులని నాట్స్ తెలిపింది. సింగింగ్‌, డ్యాన్స్‌, ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపిటీషన్‌, చెస్‌ ఛాంపియన్‌షిప్‌లు నిర్వహిస్తున్నారు. పాటలు, నృత్యానికి సంబంధించి క్లాసికల్‌, నాన్‌ క్లాసికల్‌ రెండు విభాగాల్లో పోటీలు జరుగుతాయి. 

ఈ పోటీలకు సంబంధించి చెక్‌ కాంపిటీషన్‌కి రిజిస్ట్రేషన్‌ ఫీజుగా నాట్స్‌ మెంబర్స్‌కి 15 డాలర్లు, ఇతరులకు 20 డాలర్లుగా నిర్ణయించారు. ఇక ఇతర విభాగాలకు నాట్స్‌ మెంబర్స్‌కి 10 డాలర్లు, ఇతరులకు 15 డాలర్లుగా ఉంది. నాట్స్‌ వెబ్‌సైట్‌ (www.natsworld.org/balala-registration) కి వెళ్లి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని నాట్స్‌ బోర్డు చైర్మన్‌ శ్రీధర్‌ అప్పసాని, నాట్స్‌ ప్రెసిడెంట్‌ విజయ శేఖర్‌ అన్నేలు కోరారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement