నాటా ప్రధాన కార్యదర్శి సామల ప్రదీప్ (ఫైల్ ఫొటో)
హన్మకొండ చౌరస్తా: అద్భుత ఫలితాలు అందించే యువతరాన్ని సానపెట్టడమే తమ లక్ష్యమని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సామల ప్రదీప్ అన్నారు. వరంగల్ నగరానికి చెందిన సామల ప్రదీప్ ఇరవై ఏళ్ల క్రితం అమెరికాల వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాటా సేవా డేస్ పేరుతో ప్రతీ రెండేళ్లకు ఓ సారి స్వంత ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతంలో 2015లో సేవ్ చైల్డ్ గర్డ్ థీమ్‌తో పని చేశారు. ఈ సారి భావి భవిత యువత అనే కాన్సెప్టుతో డిసెంబరు 21న వరంగల్ నగరంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రదీప్ వెల్లడించారు. ...
నెగిటివ్ తగ్గించాలి
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ రెండో పెద్ద నగరం. ఎడ్యుకేషన్ హబ్ దేశ భవిష్యత్తును నిర్ణయించే యువతరం ఇక్కడుంది. కానీ కాలేజ్ ఏజ్‌లో లక్ష్యానికి దూరంగా తీసుకెళ్లే ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్ లాంటికి ఈ కోవలోకే వస్తాయి. వీటికి సమ యువత, సమాజం నుంచి క్రమక్రమంగా ఆమోదముద్ర లభించడం మంచి పరిణామంక కాదు.
పాజిటివ్ పెంచాలి
పరీక్షల్లో పాసవడమే లక్ష్యంగా చదువుల సాగించే విద్యార్థులు గ్లోబలేజేషన్ నేపథ్యంలో ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు, ఉపాధి పొందడం కష్టం. నేటి పరిస్థితులకు తగ్గట్లుగా విద్యార్థులు తమలో ఉన్న సహాజ ప్రతిభకు ఎలా మెరుగు పెట్టుకోవాలి, మన ప్రయత్నంలో ఎదురయ్యే అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవాలి. మన సమస్యలకు పరిష్కార మార్గాలు వినూత్నంగా ఎలా ఎంచుకోవాలి అనే అంశంపై నిపుణులతో సమావేశాల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటు జనాభాలో సగం ఉన్న మహిళల సాధికరత సాధించడం ఎంతో కీలకం. అందుకే మహిళా సాధికారతకు నాటా పెద్ద పీట వేస్తుంది.
21న కార్యక్రమాలు
నైపుణ్యం కలిగిన యువత, మహిళా సాధికారత లక్ష్యంగా మారథాన్ వాక్, సెమినార్లు, సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. డిసెంబరు 21న ఉదయం 7:00 గంటలకు వేయిస్థంభాలగుడి నుంచి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు మారథాన్ వాక్ నిర్వహిస్తున్నాం. ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సభర్వాల్, సినీ నటులు అలి, పూనమ్‌కౌర్‌లు ఈ వాక్‌లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:00– నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు డ్రగ్స్,డ్రైవ్ అంశంపై అకున్ సభర్వాల్, మిషన్ స్మార్ట్‌రైడ్ ఎన్జీవోకు చెందిన నందా భాఘీ, వోట్ 4 గర్ల్స్ సంస్థ నుంచి అనుషా భర ధ్వాజ్, హై కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య. లీడ్ ఇండియా 20:20 సీఈవో హరి ఇప్పనపల్లిలు దేశాభివద్ధిలో యువత, స్త్రీల పాత్ర అనే అంశాలపై ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలోనే ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ జిల్లాలకు చెందిన 40 మంది విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు అందచేస్తారు.
సాంస్కతిక కార్యక్రమాలు
నాటా సేవా డేస్ ముగింపు సందర్భంగా డిసెంబరు 21 సాయంత్రం 7 గంటలకు పబ్లిక్ గార్డెన్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. జిల్లాలో ఉన్న జానపద కళాకారులచే ప్రదర్శన,కళాకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు రఘుకుంచే,గాయకులు గీతామాధురి, శ్రీ కష్ణ తదితరులు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment