నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) రికార్డుస్థాయిలో 2016 డల్లాస్ సదస్సు కోసం ఆరు లక్షల డాలర్ల (రూ. 39 కోట్లు) విరాళాలను సేకరించింది. మెమోరియల్ డే వీకెండ్ (మే 27-29, 2016) సందర్భంగా నిర్వహించే ఈ సదస్సు కోసం శుక్రవారం (అక్టోబర్ 9న) ఇర్వింగ్లోని ఎస్ఎల్పీఎస్ కేంద్రంలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది. డల్లాస్ తెలుగు కమ్యూనిటీ మద్దతు వల్లే ఈ విరాళాల సేకరణ కార్యక్రమం అద్భుతంగా విజయవంతమైందని, ఇది వారి విజయమని నాటా 2016 కన్వీనర్ డీ రమణరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమ విజయానికి డల్లాస్ నాటా బృందానికి సంపూర్ణ మద్దతునిచ్చిన స్థానిక తెలుగు సంఘాలు, జాతీయ సంఘాలు తానా, ఆటా, నాట్స్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న ఈ సదస్సుకు దాదాపు 15వేలమంది తెలుగు సంతతి ప్రజలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని అమెరికా, కెనడా, భారత్లో ప్రముఖ టీవీచానెళ్లు లైవ్ ప్రసారం చేయనున్నాయని, ఈ కార్యక్రమం నిర్వహణకు నాటా సలహా మండలి చైర్ డాక్టర్ ప్రేమ్రెడ్డి, అధ్యక్షుడు మోహన్ మల్లం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ రాజేశ్వర్ గంగసాని రెడ్డి నిర్విరామంగా కృషిచేస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక డల్లాస్లో జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమంలో తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాటా ప్రెసిడెంట్ డాక్టర్ మోహన్ మల్లం, ప్రేమ్రెడ్డి, రిజినల్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా నాగిరెడ్డి, డాక్టర్ రమణరెడ్డి గుడూరు, రామసూర్య రెడ్డి, తారారెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి కోర్సాపాటి, సురేశ్ మండువా, ఫాల్గుణ్ రెడ్డి, ఏవీఎన్ రెడ్డి, రాఘవరెడ్డి ఘోసల, హరి వెల్కుర్, శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల, రామిరెడ్డి ఆళ్ల, డాక్టర్ స్టాన్లీరెడ్డి బుచిపూడి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆళ్ల, వెంకటరమణరెడ్డి మురారి, వెంటకరామిరెడ్డి సానివరపు, శ్రీని వంగిమళ్ల, బాబురావు సామల, చిన్నబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు
నాటాకు 39 కోట్ల విరాళాలు
Published Sat, Oct 17 2015 9:35 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
Advertisement