
ఘనంగా నాటా సభ్య సమావేశం
డల్లాస్లో నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) డల్లాస్ సంస్థ సభ్యులు ఘనంగా సభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా సభ్యత్వ నమోదుకార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
డల్లాస్: డల్లాస్లో నాటా(నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్) సంస్థ సభ్యులు ఘనంగా సభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగా సభ్యత్వ నమోదుకార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. నాటా రీజినల్ వైస్ ప్రెసిడెంట్ దర్గా నాగిరెడ్డి, కన్వీనర్ రమణా రెడ్డి, సమన్వయ కర్త రామసూర్యరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వారిని ఉద్దేశించి దర్గా నాగిరెడ్డి మాట్లాడుతూ సభకు హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నాటా ఆధ్వర్యంలో భారత్, అమెరికాలోని తెలుగువారికి తమ సంస్థ తరుపున అందిస్తున్న సేవలను వివరించారు. భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలకు కూడా సభ్యులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. మున్ముందు భారత్లో మరిన్ని కార్యక్రమాలు విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం 2016లో నాటా డల్లాస్ తరుపున నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. సంస్థ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
టాలీవుడ్ సింగర్ సుమంగళి ఆధ్వర్యంలో పలువురు గాయకులతో సంగీత కచేరి, న్యత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక నోటా సభ్యులు పూర్తి స్థాయిలో సహకారం అందించారు. టాంటెక్స్(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్), టానా(తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా), ఏటీఏ(అమెరికన్ తెలుగు అసోసియేషన్), టాటా (తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్), టీపీఏడీ(తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్), నాట్స్(నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ), డారా(డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్) తదితర సంస్థల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.