‘నాటా’ ఉచిత సేవా కార్యక్రమాలు
నాటా అధ్యక్షుడు సంజీవరెడ్డి వెల్లడి
ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉచిత సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని నాటా అధ్యక్షుడు టి.సంజీవరెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ఉచిత మంచినీటి ప్లాంట్లు, పలు శ్మశాన వాటికల్లో అధునాతన పరికరాలను సమకూర్చనున్నట్లు తెలిపారు. 29న సేవ్ ది గర్ల్ పేరిట 5కే వాక్, బిజినెస్ సెమినార్, మెడికల్ సెమినార్, రవీంద్రభారతిలో పాటల రచయిత చంద్రబోస్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది జూలై 4 నుండి 6 వరకూ అట్లాంటాలో నాటా సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సంజీవరెడ్డి తెలిపారు. ఈ కారక్రమంలో నాటా ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, సభ్యులు రామసూరిరెడ్డి, మహేష్, శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, గౌతంరెడ్డి, శ్రీధర్, సాంభిరెడ్డి, రమణరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, మల్లారెడ్డి, ద్వారకానాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.