ఆంధ్రప్రదేశ్ సి.రాఘవాచారి మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ - నాటా అవార్డు ఇన్ జర్నలిజం–2023 అందుకున్నారు. అమెరికాలోని డల్లాస్ నగరంలో డల్లాస్ కన్వెక్షన్ సెంటర్‌లో జరిగిన నాటా మహాసభల్లో కొమ్మినేని ఈ అవార్డును అందుకున్నారు. నాటా ఆధ్వర్యం లో ప్రతి రెండేళ్ల ఒకసారి జరిగే తెలుగు మహాసభలు.. ఈ ఏడాది అమెరికాలోని డల్లాస్ లోని "డల్లాస్ కన్వెన్షన్ సెంటర్"లో ఘనంగా ప్రారంభమయ్యాయి.
బ్యాంక్వెట్ డేతో ప్రారంబమైన ఈ వేడుకలు జులై 2 వరకు జరగనున్నాయి. తెలుగు ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ వివిధ రంగాలలోని ప్రముఖులను, ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన పెద్దలను ఘనంగా సన్మానించి, సత్కరించారు. ఈ వేడుకల్లో భాగంగా.. 46 సంవత్సరాల పాటు వివిధ పత్రికలు, చానళ్లలో పనిచేసిన అనుభవం, కేఎస్‌ఆర్ లైవ్ షో పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కొమ్మినేని శ్రీనివాసరావుకు జర్నలిజం విభాగంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.
(చదవండి: 'నాటా’ అవార్డు ఇన్ జర్నలిజం ఎక్సలెన్సీ–2023కు కొమ్మినేని ఎంపిక )
Comments
Please login to add a commentAdd a comment