నాటా పెయింటింగ్ పోటీ | NATA ART Competition 2020 | Sakshi
Sakshi News home page

నాటా పెయింటింగ్ పోటీ

Published Mon, Aug 24 2020 3:47 PM | Last Updated on Mon, Aug 24 2020 3:47 PM

NATA ART Competition 2020 - Sakshi

చికాగో: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) వారి ఆధ్వర్యంలో నాటా పెయింటింగ్ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపే ప్ర‌తిభావంతులు సెప్టెంబ‌ర్ 7వ తేదీలోగా పెయింటింగ్‌ను పంపించాల్సి ఉంటుంది. ఈ పోటీకి న్యాయ నిర్ణేతగా వున్నపద్మశ్రీ గ్ర‌హీత ఎస్‌వీ రామారావు.. పెయింటింగ్‌ల‌ నుంచి 10-15 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఫైనల్‌కు ఎంపిక అయిన వారితో సెప్టెంబర్ 27న ఆన్‌లైన్ ఫైన‌ల్‌ పోటీ నిర్వహించ‌నున్నారు. (వేడుకగా “నాటా - మిన్నిసోటా” మహిళా దినోత్సవం)

విజేతలకు మొదటి బహుమతిగా 500 డాల‌ర్లు, రెండవ బహుమతిగా 400 డాల‌ర్లు, మూడవ బహుమతిగా 300 డాల‌ర్లు, అలాగే మిగిలిన ఏడుగురికి 100 డాల‌ర్ల‌ చొప్పున బహుమతులు ఉంటాయి. ఈ సదవకాశం ప్రపంచంలో వున్న తెలుగు వారికీ అందరికీ! ఇంకెందుకు ఆలస్యం సెప్టెంబర్ 7లోగా మీ పెయింటింగ్‌ను పంపండి. ఈ పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు https://www.nataus.org/art2020 ను సంప్రదించగలరు. (ఒకేసారి 50 దేశాల్లో హనుమాన్ చాలీసా పారాయణం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement