ఘనంగా ముగిసిన నాటా మహా సభలు
తెలుగు ప్రజలంతా డల్లాస్, టెక్సాస్ వేదికగా ఒకే చోట చేరడంతో నగరం పులకించిపోయింది. మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరిగిన నాటా మహా సభలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. డల్లాస్లో ఓమ్ని హోటల్‌తో అనుబంధంగా విస్తరించిన కన్వెన్షన్ సెంటర్లో , వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఎటు చూసినా తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలుగు సంభాషణలు, నవ్వులు, పువ్వులు, కబుర్లతో పండుగను తలపించింది.
చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో కొత్త జీవనోత్సాహాన్ని నింపిన నాటా నిర్వాహకులు.. డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి(నాటా మహానాయకులు, పోషకులు), నాటా అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లం, అడ్వైజర్ ఎ వి ఎన్ రెడ్డి, డాక్టర్ ఆదిశేషారెడ్డి, డాక్టర్ స్టాన్లీ రెడ్డి, జితేందర్ రెడ్డి, కన్వీనర్ గూడూరు రమణారెడ్డి, కన్వెన్షన్ కో ఆర్డినేటర్ రామసూర్యారెడ్డి, మాజీ అధ్యక్షులు సంజీవ రెడ్డికి, నాటా ఎలెక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేశ్వర్ గంగసాని, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గోశాలరాఘవరెడ్డి, సెక్రటరీ గిరీష్ రామిరెడ్డి, ట్రెజరర్ హరి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ గానగోని, మల్లిక్ బండ, ఇండియా కో ఆర్డినేటర్ డాక్టర్ ద్వారకనాధరెడ్డి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జయచంద్రారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆళ్ళరామిరెడ్డి, కన్వెన్షన్ అడ్వైజర్ ప్రదీప్ సామల, శ్రీధర్ కొర్సపాటి, ఫల్గుణ్ రెడ్డి, నాగిరెడ్డి దర్గా రెడ్డి, సురేష్ మండువ, గీత దమ్మన, వెంకట్ వడ్డాడి, శేఖర్ కోనాల, మోహన్ కలాడి, తలపులపల్లి చిన్నబాబురెడ్డి తదితరులను వీక్షకులు కొనియాడారు.
వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వాళ్ళు, అమెరికా సంయుక్త రాష్ట్రాలనుంచి కుటుంబాలతో కదలివచ్చినవాళ్ళు ఉన్నారు. నెల రోజులపాటు అమెరికాలోని ప్రధాన నగరాల్లో నిర్వహించిన కొత్త తరం తెలుగు గాయకుల అన్వేషణా కార్యక్రమం నాటా ఐడల్. ఈ కార్యక్రమాన్ని నాటా బ్రాండ్ అంబాసిడర్ చంద్రబోస్, సంగీత దర్శకులు రఘు కుంచె, సెక్రటరీ గిరీష్ రామిరెడ్డిలు తమ భుజస్కంధాలపై వేసుకుని ఎంతో శ్రమతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి నాటాకు మరింత కీర్తిని అందించారు.
విశేష సేవలందించిన వారికి.. నాటా అవార్డులు
ముఖ్యంగా నాటా వేదిక మీద వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి నాటా అవార్డులతో సత్కరించింది. సుధాకర్ రామకృష్ణ(వ్యాపారం), ఆరాధ్యుల కోటేశ్వరరావు, వినయిని జయసింఘే( కల్చరల్), తుర్లపాటి ప్రసాద్(సాహిత్యం),మాంచు ఫర్రర్, ఆర్ కె పండిటి(కమ్యూనిటీ సర్వీస్), చంద్రుపట్ల తిరుపతిరెడ్డి(ఇంజనీరింగ్), జిబికె మూర్తి(జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్), డాక్టర్ కాంతారెడ్డి, డాక్టర్ జగన్ కాకరాల(మెడిసిన్), వేల్కూరి శ్రీహరి సంజీవి( పబ్లిక్ సర్వీస్), కెఆర్ కె రెడ్డి, పోచ బ్రహ్మానందరెడ్డి(రీసెర్చ్), ప్రణతి శర్మ గంగరాజు, తీగల సాహిత్ రెడ్డి(యూత్) లకు అవార్డులను బహుకరించింది. నాటా లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డును ప్రఖ్యాత సినిమా దర్శకులు ఎ. కోదండరామిరెడ్డికి అందించింది. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, కవులు, నాటకరంగ కళాకారులు, ఆధ్యాత్మిక గురువులు, పత్రికా సంపాదకులు హాజరై నాటా తెలుగుదనానికి మరింత సొబగులు అద్ది తెలుగు పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు తన ఆటాపాటలతో వినోదాన్ని అందించే నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, నిత్యామీనన్, హీరోలు సుదీర్ బాబు, వరుణ్ తేజ్ లు అలరించారు. రాజకీయ ప్రముఖులు వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్లమెంట్ సభ్యులు పివి మిథున్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, ఎమ్మెల్యే సంపత్ కుమార్, బుడ్డా రాజశేఖర్రెడ్డిలు హాజరై తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు వేదిక గా నిలిచారు.
నాటాలో ఫోర్త్ ఎస్టేట్
పత్రికా సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నాటా నిర్వహించిన ఫోర్త్ ఎస్టేట్ సదస్సుకు విచ్చేసి తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుత రాజకీయ, సామజిక పరిణామాలను, పార్టీల పోకడలను వివరించారు.
నరాల రామిరెడ్డి, అఫ్సర్ ల ఆధ్వర్యంలో నాటా తెలుగు సాహితీసభ విజయయవంతమైంది. ఇక అమెరికా లోని అలుమ్ని అసోసియేషన్ల కలయికలు సభకు విచ్చేసిన వారందరికి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. విద్యార్థినాటి జ్ఞాపకాలు, కబుర్లు, ముచ్చట్లు సరదా సరదాగా జరిగాయి. వీటిలో ముఖ్యంగా ఎన్ బి కె ఆర్ ఐఎస్ టి, ఎపిఎంజి యుఎస్ఎ, కర్నూలు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, సిబిఐటి, ఎస్వీ యూనివర్సిటీ, విఆర్ కాలేజీ, గీతమ్ యూనివర్సిటీ, చిత్తూరు ఎన్ఆర్ఐ, రాయలసీమ ఎన్ఆర్ఐ ఫోరం, గ్యారంపల్లి ఎపిఆర్ జెసి స్కూల్, ఎన్ఐటి వరంగల్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ, కెఎస్ఆర్ఎం కాలేజీ పూర్వ విద్యార్థుల కలయిక నాటా కన్వెన్షన్ కు కొత్త కళ తీసుకొచ్చింది.
అలా ఉత్సాహంగా ప్రారంభమైన కార్యక్రమం చివరి ముగింపు వరకు ప్రేక్షకులకు, తెలుగు వారందరికి ఎన్నో మధురానుభూతులను పంచిపెట్టింది. ముఖ్యంగా ముగింపు చివరి క్షణాల్లో నాటా అడ్వయిజర్ డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆట, పాట ప్రేక్షకులకు కొత్త జోష్ ను తీసుకొచ్చాయి. ఆయన ఆటకు పాటకు, కోటి సంగీత కచ్చేరీ కన్వెన్షన్ ముగింపు సన్నివేశాలకు కొత్తకళను తీసుకొచ్చింది. అధ్యక్షులు డాక్టర్ మోహన్ మల్లంగారి సమర్థవంతమైన సభా నిర్వహణ మొత్తం కన్వెన్షన్కు నిండుదనం తీసుకొచ్చింది. ఇక మూడు రోజులపాటు జరిగిన ఈ పండుగ విజయోత్సవానికి మూలకారకులు, శ్రమజీవులు అన్ని విభాగాల చైర్స్, వాలంటీర్లనే చెప్పాలి. వారిలో ప్రధానంగా డాక్టర్ రాఘవరెడ్డి( లోకల్ అడ్వయిజర్), విష్ణు బత్తుల(ఆడిట్), శ్రీరంగపల్లి సుధాకర్ రెడ్డి( అలుమ్ని), ప్రసాద్ జి. రెడ్డి( అవార్డ్స్), రేఖారెడ్డి(బాంక్వెట్), ఆనంద్ దాసరి(సెమినార్స్), డాక్టర్ మర్యాద రెడ్డి( సిఎంఇ), శ్రీనివాస్ గనగోని( కార్పొరేట్), నాగిరెడ్డి దర్గా రెడ్డి(కల్చరల్), సరితారెడ్డి కొండా(డెకరేషన్స్), ప్రసున్నా రెడ్డి( ఫైనాన్సు), మల్లు మధు( ఫుడ్), మురారి మల్లికార్జునరెడ్డి(హాస్పిటాలిటీ), డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ(లాంగ్వేజ్ లిటరరీ), క్రిష్టపాటి రమణారెడ్డి(ఇమ్మిగ్రేషన్, ఐటి), రమేష్ గదిరాజు(ఇన్ఫో హబ్), జయ పలగల(ఎన్ఆర్ఐ), తిరుమల రెడ్డి( మీడియా), శ్రీకాంత్ కొత్తపల్లె(పబ్లిసిటీ, పిఆర్), రవి అరిమండ (ప్రోగ్రామ్స్, ఈవెంట్స్), ఉమా మహేశ్వర్ రెడ్డి( పొలిటికల్ ఫోరం), శ్రీనివాస్ రెడ్డి ఓబులరెడ్డి( ప్యానెల్ డిస్కషన్స్), వడ్డాడి వెంకట్( రిజిస్ట్రేషన్స్), శ్రీదేవి తేనేపల్లి( రిసెప్షన్), శ్రీనివాస్ గనగోని( షార్ట్ ఫిలిమ్స్), రవి కొండ( సెక్యూరిటీ), కొత్త రఘునాథ్ రెడ్డి(సావనీర్), డాక్టర్ సుబ్రమణ్యం బోయరెడ్డి( స్పిర్చువల్), సురేష్ కాకు(స్టేజి, ఎవి), ఎన్ఎంఎస్ రెడ్డి( స్పోర్ట్స్, హెల్త్), ఉమా మహేష్ పర్నపల్లి( ట్రాన్స్ పోర్టేషన్), సురేష్ మండువ( వెన్యూ), నగేష్ బాబు దిండుకుర్తి( వాలంటీర్స్), శశి లింగనేని( వెబ్), శుభాంజాలి వెలగ( విమెన్స్), శుభద్ర( యూత్). శ్రీధర్ కొర్సపాటి, గీత దమ్మన, సురేష్ మండువ, సురేష్ వెంకటేష్ ముత్యాల ఇంకా అనేక మంది కృషి మరువలేనిదనే చెప్పాలి. కల్చరల్ చైర్ నాగిరెడ్డి దర్గా రెడ్డి ఆధ్వర్యంలో కన్వెన్షన్ సెంటర్లో అతిపెద్ద వేదికైన ఎరీనా, రెండో వేదిక అందించి వినోదానికి ప్రేక్షకులు మధురానునుభూతులతో తడిసి ముద్దయ్యారు.