అట్లాంటాలో ఘనంగా నాటా అంత్యాక్షరి పోటీలు | NATA Sponsors Amritavarshini Anthyakshari | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో ఘనంగా నాటా అంత్యాక్షరి పోటీలు

Published Mon, May 26 2014 4:15 PM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

అట్లాంటాలో ఘనంగా నాటా అంత్యాక్షరి పోటీలు

అట్లాంటాలో ఘనంగా నాటా అంత్యాక్షరి పోటీలు

అట్లాంటాలోని అమృతవర్షిణి సంస్థ వార్షిక అంత్యాక్షరి పోటీలని మే 10 2014 శనివారం నాడు ఘనంగా నిర్వహించింది. దాదాపు మూడు వందలమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు అరవైమంది ఔత్సాహికులైన సినిమాప్రియులు పదకొండు టీములుగా ఏర్పడి హోరాహోరీగా ఈ పోటీలలో తలపడ్డారు. నాటా సంస్థ తరఫున, సంస్థ మూల స్థంభాలైన డాక్టర్ పేరెడ్డిగారు డాక్టర్ మల్లా రెడ్డిగార్లు విరాళాలను అందచేసి ఈకార్యక్రమం విజయవంతం చేసారు.

ఈ కార్యక్రమానికి డొక్కాఫణి, భాను శ్రీవావిలికొలను వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.  యప్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని నాటా చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంచేసారు. వందలాది మంది ప్రపంచవ్యాప్తం ఈ ప్రసారాలను తిలకించి ఉత్సాహంగాపాల్గొన్నారు. అనేక పర్యాయాలు టెక్స్ట స్టేజీ ద్వారా  పోటీలలోఅడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలను తెలియజేశారు.

సుమారుఆరుగంటలపాటుజరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోటీలో శ్రీవినోద్గండి కోటటీం (వినోద్గండికోట, సంధ్యఈశ్వర, సునీతమేదరమెట్ల, సుష్మసరికొండ, ఉమజంచెడ్ ) మొదటిబహుమతిని (ఐదువందలడాలర్లు, ట్రోఫీలు), శ్రీబాలఇందుర్తి టీం (బాలఇందుర్తి, మాధవిఇందుర్తి, ప్రతిమనల్లగట్ల, నీలిమగడ్డమణుగు, శైలజగెళ్ళ) రెండవబహుమతిని (మూడువందలడాలర్లు, ట్రోఫీలు), శ్రీ.గోపాల్  తురగటీం (గోపాల్తురగ,ఉషమోచెర్ల,జయశ్రీతంగిరాల, రాజశ్రీభూషణ్, జ్యోతిసీతారాం) మూడవబహుమతిని (రెండు వందలడాలర్లు, ట్రోఫీలు) గెలుచుకున్నాయి.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement