Amritavarshini
-
ప్రణయ్ హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
నల్లగొండ క్రైం: ప్రణయ్ హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌లు ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారిని కలిశారు. కలెక్టర్, ఎస్పీలు వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. అమృత–ప్రణయ్‌ల మధ్య పరిచయం, చదువు మధ్యలో ఆపివేసిన పరిస్థితులు, వీరి పెళ్లికి కుటుంబ సభ్యుల అభ్యంతరం తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అమృతకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రూ.4లక్షలు అందజేశామని, ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేసులో ఇంకా ఎలాంటి సహాయ సహకారాలు కావాలో చెప్పండని వారు అమృత, కుటుంబ సభ్యులను కోరగా నిందితులకు బెయిల్ రాకుండా చూడాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశం తర్వాత వారు మీడియాకు వివరాలు తెలిపారు. అంతకుముందు హత్య ఘటన, కేసు విచారణ, నిందితుల వివరాలు, చట్టం ప్రకారం తీసుకుంటున్న చర్యలను ఎస్పీ.. వారికి వివరించినట్లు తెలిసింది. ప్రణయ్ ట్రస్టు ఏర్పాటు చేస్తా మారుతీరావు ఆస్తులన్నీ ట్రస్టుకు అప్పగించాలి: అమృత డిమాండ్ మిర్యాలగూడ: ప్రేమ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న పెరుమాళ్ల ప్రణయ్ పేరున ట్రస్టు ఏర్పాటు చేస్తానని అతని భార్య అమృత వర్షిణి పేర్కొన్నారు. బుధవారం ‘సాక్షి’తో ఆమె మాట్లాడుతూ... తన తండ్రి మారుతీరావు ఇంట్లో ఉన్న అమృత జీనియస్ స్కూల్ భవనాన్ని ట్రస్టుకు కార్యాలయంగా చేయాలని, ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ ట్రస్టుకు చెందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మారుతీరావు ద్వారా నష్టపోయిన బాధితులందరికీ ప్రణయ్ ట్రస్టు ద్వారా న్యాయం చేస్తానన్నారు. బెయిల్ ఇవ్వకుండా ఉరితీయాలి ప్రణయ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురు వ్యక్తులు బెయిల్ కూడా ఇవ్వకుండా ఉరి తీయాలని ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామి డిమాండ్ చేశారు. శ్రవణ్ బయటకు వస్తే తమను కూడా చంపుతాడని, నిందితులు బెయిల్‌పై వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారన్నారు. -
కోర్టుకు ప్రణయ్ హత్య కేసు నిందితులు
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఈ నెల 14వ తేదీన జరిగిన ప్రణయ్ హత్య కేసులో నిందితులను బుధవారం పోలీసులు మిర్యాలగూడలోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో తిరునగరు మారుతీరావు, సుభాష్‌శర్మ, అస్గర్‌అలీ, మహ్మద్ బారీ, ఎంఏ కరీం, తిరునగరు శ్రవణ్‌కుమార్, శివలపై హత్యా నేరం, కుట్ర వంటి కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరుగురు నిందితులను నల్లగొండ నుంచి మినీ బస్సులో భారీ పోలీస్ బందోబస్తు నడుమ కోర్టుకు తీసుకువచ్చారు. ముందుగా నిందితులకు స్థానిక ఏరియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 4.12 గంటలకు డీఎస్పీ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్ శోభారాణి కేసును పరిశీలించి నిందితులను అక్టోబర్ 3వ తేదీ వరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారు. కాగా, ప్రణయ్‌ని హత్య చేసిన ఏ–2 నిందితుడు, బిహార్‌కు చెందిన సుభాష్‌శర్మను కోర్టులో హాజరు పరచలేదు. ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ ఫేస్బుక్ పేజీకి ఆదరణ ప్రణయ్‌కి న్యాయం జరగాలని ఆయన భార్య అమృత వర్షిణి ఫేస్బుక్లో పేజీ ఏర్పాటు చేశారు. ప్రణయ్ హత్యను ఖండిస్తూ, అమృతకు మద్దతుగా ఇప్పటివరకు 32,752 మంది పేజీని లైక్ చేశారు. -
అట్లాంటాలో ఘనంగా నాటా అంత్యాక్షరి పోటీలు
అట్లాంటాలోని అమృతవర్షిణి సంస్థ వార్షిక అంత్యాక్షరి పోటీలని మే 10 2014 శనివారం నాడు ఘనంగా నిర్వహించింది. దాదాపు మూడు వందలమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు అరవైమంది ఔత్సాహికులైన సినిమాప్రియులు పదకొండు టీములుగా ఏర్పడి హోరాహోరీగా ఈ పోటీలలో తలపడ్డారు. నాటా సంస్థ తరఫున, సంస్థ మూల స్థంభాలైన డాక్టర్ పేరెడ్డిగారు డాక్టర్ మల్లా రెడ్డిగార్లు విరాళాలను అందచేసి ఈకార్యక్రమం విజయవంతం చేసారు. ఈ కార్యక్రమానికి డొక్కాఫణి, భాను శ్రీవావిలికొలను వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. యప్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని నాటా చానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంచేసారు. వందలాది మంది ప్రపంచవ్యాప్తం ఈ ప్రసారాలను తిలకించి ఉత్సాహంగాపాల్గొన్నారు. అనేక పర్యాయాలు టెక్స్ట స్టేజీ ద్వారా పోటీలలోఅడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాలను తెలియజేశారు. సుమారుఆరుగంటలపాటుజరిగిన ఈ ఉత్కంఠభరితమైన పోటీలో శ్రీవినోద్గండి కోటటీం (వినోద్గండికోట, సంధ్యఈశ్వర, సునీతమేదరమెట్ల, సుష్మసరికొండ, ఉమజంచెడ్ ) మొదటిబహుమతిని (ఐదువందలడాలర్లు, ట్రోఫీలు), శ్రీబాలఇందుర్తి టీం (బాలఇందుర్తి, మాధవిఇందుర్తి, ప్రతిమనల్లగట్ల, నీలిమగడ్డమణుగు, శైలజగెళ్ళ) రెండవబహుమతిని (మూడువందలడాలర్లు, ట్రోఫీలు), శ్రీ.గోపాల్ తురగటీం (గోపాల్తురగ,ఉషమోచెర్ల,జయశ్రీతంగిరాల, రాజశ్రీభూషణ్, జ్యోతిసీతారాం) మూడవబహుమతిని (రెండు వందలడాలర్లు, ట్రోఫీలు) గెలుచుకున్నాయి.