అట్లాంటా: ఆటా, టాటాలతో కలసి వచ్చే ఏడాది జులైలో ఫిలడెల్ఫియాలో నిర్వహించనున్న యూనైటెడ్ అమెరికన్ తెలుగు కన్వెన్షన్(యూఏటీసీ)కు నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) నిధుల సేకరణను ప్రారంభించింది. ఈ మేరకు నాటా నిర్వహించిన బోర్డు సమావేశంలో ఆరు లక్షల డాలర్లను విరాళంగా వచ్చాయి. ఈ మేరకు నాటా ఓ ప్రకటన విడుదల చేసింది.
బోర్డు సమావేశంలో నాటా అడ్వైజరీ కౌన్సిల్ డా. ప్రేమ్ రెడ్డి, సభ్యులు డా. స్టాన్లీ రెడ్డి, జితేందర్ రెడ్డి, డా. ఆదిశేష రెడ్డి, అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గంగసాని, డా. రాఘవా రెడ్డి ఘోసల, మాజీ అధ్యక్షుడు డా. మోహన్ మల్లం, ఈవీపీ శ్రీధర్ కొర్సపాటి, కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పెనుమాడ, కోశాధికారి చిన్నాబాబు రెడ్డి, సంయుక్త కార్యదర్శి అన్నా రెడ్డి, ఐవీపీ సాంబా రెడ్డి, రమేశ్ అప్పారెడ్డి, బోర్డు డైరెక్టర్లు అంజన్ కర్ణంతి, బాబురావు సమాల, ద్వారక్ వారణాసి, హరి వెల్కూర్, జనార్ధన్ రెడ్డి బోయెళ్ల, మల్లిఖార్జున్ జెర్రిపోతుల, నారాయణ రెడ్డి గండ్ర, ప్రదీప్ సమల, ప్రసూన దోర్నాదుల, రఘురామి రెడ్డి ఏటుకూరు, రామసూర్యా రెడ్డి, శరత్ మండపాటిలు పాల్గొన్నారు.
ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో నాటా అట్లాంటా టీంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొట్లూరి శ్రీనివాస రెడ్డి, మెంబర్‌షిప్ కమిటీ చైర్ నంద గోపినాథ్ రెడ్డి, మాజీ బీఓడీ రవి కందిమల్ల, ఆర్‌వీపీ కిరణ్ కందుల, ఓవర్సీస్ కో-ఆర్డినేటర్ వెంకట్ మొండెద్దు, సోషల్ మీడియా చైర్ మాధవి ఇందుర్తి, నాటా జర్నల్ కమిటీ చైర్మన్ గురు పరాధరమి, పబ్లిసిటీ కో-చైర్ ధనుంజయ రెడ్డి, సుధీర్ అమిరెడ్డి, నరసింహా రెడ్డి, రమేష్ మేడా, అనిల్ రెడ్డి, వెంట్రామి రెడ్డి చింతం, ఉమా కావలికుంట, కృష్ణ నరేసపల్లి, జయచంద్రా రెడ్డిలు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేశారు.
ఏపీ, తెలంగాణలో నాటా సేవా దినాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాటా సేవా దినాలను నిర్వహించాలని కూడా బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నుంచి 23 వరకూ కర్నూలు, బెంగుళూరు, తిరుపతి, గుంటూరు, నల్గొండ, వరంగల్‌లో సేవా దినాలను నిర్వహిస్తారు. సేవా దినాల్లో భాగంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, హెల్త్ క్యాంప్‌లు, వాటర్ ప్లాంట్స్, టాయిలెట్స్, కవి సమ్మేళనం, బిజినెస్ సెమినార్లు ఉంటాయి.