సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం | NATA Member Meets AP CM YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

Published Mon, Jul 15 2019 7:13 PM | Last Updated on Mon, Jul 15 2019 8:16 PM

NATA Member Meets AP CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) బృందం కలిసింది.  వెలగపూడిలోని అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నాటా సభ్యులు ఆయన ఛాంబర్‌లో కలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో న్యూజెర్సీలో జరిగే ‘నాటా’ మహాసభలకు రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు నాటా సభ్యులు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ మేకా శివ, ఇంటర్నేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కిష్టపాటి రమణారెడ్డి, నాటా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ సాగంరెడ్డి అంజిరెడ్డి, ఇండియా కో–ఆర్డినేటర్‌ మల్లు ప్రసాదరెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement