New Jersey
-
'ఆఫ్ బీజేపీ' న్యూజెర్సీలో బీజేపీ నేృతృత్వంలోని ఎన్డీఏ గెలుపు సంబరాలు
అమెరికాలో న్యూజెర్సీ రాష్టంలో సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ చారిత్రాత్మక విజయాన్ని భారతీయ అమెరికన్ కమ్యూనిటీ జరుపుకుంది. ఆఫ్ బీజేపీ అమెరికా (OFBJP-USA ) అధ్యక్షుడు డాక్టర్ అడపా ప్రసాద్ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆఫ్ బీజేపీ. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజెపీ ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పట్ల భారత సంతతి అమెరికన్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మందికి పైగా ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉత్సాహభరితమైన డోల్ తాషా ప్రదర్శనలు, ఎన్నారైల నృత్యాలతో ప్రారంభమయ్యింది. బీజేపీ విజయానికి గుర్తుగా ఉత్సాహన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాలన్నీ ఆనందభరితంగా సాగాయి. దీనికి వ్యాఖ్యాతగా జ్యోత్స్న వ్యవహరించారు. ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు అధ్యక్షుడు డా. అడపా ప్రసాద్ ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, ఎన్డీఏ కూటమి భాగస్వాములకు అభినందనలు తెలిపారు. ముచ్చటా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ చారిత్రక విజయాన్ని హైలెట్ చేశారు. 1962 తర్వాత తొలిసారిగా వరసగా మూడోసారి ప్రజలు బీజేపీకే అధికారం కట్టబెట్టారని అన్నారు. ఈ మేరకు ఆఫ్ బీజేపీ వాసుదేవ్ పటేల్ మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం తన వేగవంతమైన అభివృద్ధిని కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో రెండో ప్రపంచ యుద్ధానంతరం వరుసగా మూడోసారి ఎన్నికైన నాయకుడు నరేంద్ర మోదీనే అని, ప్రతిసారి స్థిరమైన ఓట్ల శాతంతో అంతర్జాతీయ రికార్డుని నెలకొల్పారని కృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. టీడీపీ, జనసేన, జేడీయూ, శివసేన, బీజేపీతోపాటు దాని ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల విజయాన్ని ప్రశంసించారు.డా. సుధీర్ పారిఖ్, శ్రీ ఆల్బర్ట్ జెస్సాని,పీయూష్ పటేల్ బీజేపీ ప్రభుత్వ విజయాలపై ప్రసంగించారు. అఫ్ బీజేపీ తెలంగాణ కన్వీనర్ /అధ్యక్షుడు విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ.. తెలంగాణలోని ఎంపీ సీట్ల కోసం అమెరికాలో అన్ని తెలంగాణ ఆఫ్ బీజేపీ కమిటీ చాఫ్టర్లు కలిసి కట్టుగా 12 ఎంపీ జూమ్ కాల్స్, ఫోన్ కాల్ కాంపెయిన్, సోషల్ మీడియాలో వీడియోలు, ఛాయ్ పే చర్చలు, గ్లోబల్ క్యాలాథన్, గ్లోబల్ ఛాయ్ పే చర్చలు, యజ్ఞాలు/హామములు లాంటివి చేసి 17 ఎంపీలలో ఎనిమిది వచ్చేలా కృషి చేశారని వివరించారు. అలాగే రాబోయే 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశాభావన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం చరణ్ సింగ్ గారు ఉత్తర ప్రదేశ్ కోసం, అమర్ గోస్వామి గుజరాత్ కోసం కారు ర్యాలీ లాంటివి చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా. సుధీర్ పరేఖ్, జయేష్ పటేల్, పీయూష్ పటేల్, కమ్యూనిటీ నాయకులు, వాలంటీర్లు సహా న్యూజెర్సీ అంతటా భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. కల్పనా శుక్లా, మా రాజ్యలక్ష్మి, దీప్తి జానీ, సంతోష్ రెడ్డి, గణేష్ రామకృష్ణన్, మధుకర్ రెడ్డి, శివదాసన్ నాయర్, జయశ్రీ, గోవిందరాజ్, ఓంప్రకాష్ నక్క, జగదీష్ యలిమంచిలి, ప్రవీణ్ తడకమళ్ల , రఘు రెడ్డి, రామ్ వేముల, శరత్ వేముల, విజయ్ కుందూరు, శ్రీనివాస్ గనగోని, శ్రీకాంత్ రెడ్డి, పృధ్వి, రవి పెద్ది, నాగ మహేందర్, మధు అన్న, భాస్కర్, దాము గాదెల, ప్రవీణ్ గూడూరు, సుధాకర్ ఉప్పల, మృధుల,లక్ష్మీ మోపర్తి, గురు ఆలంపల్లి, గోపి, తదితర కమ్యూనిటీ లీడర్లు పాల్గొన్నారు .(చదవండి: అట్లాంటాలో అట్టహాసంగా ముగిసిన 18 వ ఆటా కన్వెన్షన్) -
నాట్స్‌కు సొంత కారును విరాళమిచ్చిన తెలుగు మహిళ
న్యూ జెర్సీ: అమెరికాలో అనేక సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి తమ వంతు సహకారం అందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే న్యూజెర్సీకు చెందిన తెలుగు మహిళ బినోదిని వుతూరి తను వాడే సెడన్ కారును నాట్స్‌కు విరాళంగా ఇచ్చారు. ఇటీవలే క్యాన్సర్‌ను జయించిన బినోదిని.. సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ తన మద్దతును తెలుపుతూ ఉంటారు. నాట్స్ చేపట్టే సేవా కార్యక్రమాలను తెలుసుకున్న బినోదిని తన వంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటితో మాట్లాడి తన సొంత కారును విరాళంగా ఇస్తానని ప్రకటించగా, అనుకున్న విధంగానే ఆమె కారుకు సంబంధించిన యాజమాన్య హక్కులను నాట్స్ కు బదలాయించారు. ఈ కార్యక్రమానికి నాట్స్ బోర్డ్ సెక్రటరీ ప్రశాంత్ పిన్నమనేని సహకరించారు. నాట్స్ బోర్డ్ డైరక్టర్ మోహనకృష్ణ మన్నవ ఆధ్వర్యంలో నాట్స్ న్యూజెర్సీ విభాగం నుంచి శ్రీ హరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీవెనిగళ్ల, చంద్రశేఖర్ కొణిదెల, సురేశ్ బొల్లు, శేషగిరి కంభంమెట్టు, రాంబాబు వేదగిరి, మురళీ మేడిచెర్ల తదితర నాట్స్ నాయకులు బినోదిని ఇంటికి వెళ్లి కారు డాక్యుమెంట్లను స్వీకరించారు. నాట్స్ కోసం బినోదిని తన కారును విరాళంగా ఇవ్వడంపై నాట్స్ నాయకులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: భాషాభివృద్ధికి పత్రికల కృషి కీలకం -
పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీ.. వారిని కాపీ కొట్టిందా!
ముంబై: ఐపీఎల్ 2021 సందడి షురూ అయింది. ఈ ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంఛైజీలన్నీ కొత్త జెర్సీలను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ నూతన జెర్సీలను రిలీజ్ చేయగా తాజాగా పంజాబ్ కింగ్స్ సరికొత్త డిజైన్‌తో రూపొందిన జెర్సీని మంగళవారం విడుదల చేసింది. ఈసారి కొత్తగా గోల్డెన్ స్ట్రిప్‌లతో రెడ్ జెర్సీని తయారు చేశారు. లోటస్ హెర్బల్, ఎబిక్స్ క్యాష్ పంజాబ్ కింగ్స్‌కు స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్నాయి. కాగా కేకేఆర్, ఆర్సీబీ తర్వాత గోల్డెన్ కలర్ హెల్మెట్లను వినియోగించనున్న మూడో జట్టు పంజాబే కావడం విశేషం. ఈ ఏడాది పేరు మార్చుకున్న పంజాబ్(గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్) సరికొత్త మార్పులతో రాబోయే సీజన్‌కు సన్నద్ధమవుతోంది. కాగా కేఎల్ రాహుల్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్ ఏప్రిల్ 12న ముంబై వేదికగా తన తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ల షెడ్యూల్ అయితే పంజాబ్ కింగ్స్ కొత్త జెర్సీపై సోషల్ మీడియాలో అప్పుడే ట్రోల్స్ మొదలయ్యాయి. రోరింగ్ లయన్ గోల్డెన్ షీల్డ్‌తో ఉన్న పంజాబ్ జెర్సీ గతంలో ఆర్సీబీ వాడిన జెర్సీని గుర్తుకు తెస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ''ఆర్సీబీ వాడిన జెర్సీని వాడారు.. మనకు కలిసి రాకపోవచ్చు.. 2008లో ఆర్సీబీ ఇలాంటి జెర్సీతోనే బరిలోకి దిగింది.. అప్పుడు వారిని దురదృష్టం వెంటాడింది.. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తుంది.. కనీసం సొంత జెర్సీ కూడా తయారు చేసుకోలేని దుస్థుతిలో ఉన్నారా..'' అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఐపీఎల్ 2021: భారీ అంచనాల నడుమ ఆర్సీబీ 𝐓𝐡𝐞 𝐰𝐚𝐢𝐭 𝐢𝐬 𝐨𝐯𝐞𝐫! ⌛ Reveal kar rahe hain assi, saddi new jersey 👕😍#SaddaPunjab #PunjabKings #IPL2021 pic.twitter.com/zLBoD0d5At — Punjab Kings (@PunjabKingsIPL) March 30, 2021 Hang on...Isn't this RCB from 2008? @WasimJaffer14 might know 😉 https://t.co/Je2w2KYJqg — Vishal Dikshit (@Vishal1686) March 30, 2021 shame on u @PunjabKingsIPL can't u prepare ur own jersey copying from RCB jersey😒 https://t.co/YTqC1ZNZc9 — M.r.Sr@van18 (@sravan1118) March 30, 2021 -
న్యూజెర్సీలో అనంతపురం వాసి మృతి
న్యూ జెర్సీ: అనంతపురంకు చెందిన మసూద్ అలీ (40) నూజెర్సీలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మసూద్‌కు భార్య ఆయేషా, ఏడేళ్ల కుమార్తె అర్షియా ఉన్నారు. అక్టోబర్ 1న అర్షియా పుట్టినరోజు సందర్భంగా బెలూన్ల కోసం ఆయన అపార్ట్మెంట్ బయటకు వచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మసూద్ అలీ పార్ధీవ దేహాన్ని భారతదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు చేసింది. H1 స్టేటస్ లో ఉన్న ఆయన .. తన భార్య, కూతురుతో కొద్ది నెలల క్రితమే భారత్ నుంచి నుండి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: విద్యార్థులకు ‘గాటా’ చేయూత.. -
న్యూజెర్సీలో అరుదైన రాటిల్ స్నేక్
వాషింగ్టన్: న్యూజెర్సీ అడవుల్లో అరుదైన రెండు తలల రాటిల్ స్నేక్ జన్మించింది. గత నెల 25న బర్లింగ్టన్ కౌంటీలోని హెర్పెటోలాజికల్ అసోసియేట్స్‌కు చెందిన ఇద్దరు ఉద్యుగులు ఈ అరుదైనన రాటిల్ స్నేక్ పిల్లను గుర్తించారు. దీని గురించి హెర్పెటోలాజికల్ అసోసియేట్స్ సీఈవో బాబ్ జప్పలోర్తి మాట్లాడుతూ.. ‘న్యూజెర్సీలో ఇలాంటి రెండు తలల రాటిల్ స్నేక్ కనిపించడం ఇదే ప్రథమం. కానీ ఇది ఎక్కువ రోజులు బతకలేదు. పాకే సమయంలో ఏదైనా వేటాడే జీవి కంట పడితే అది దీన్ని చంపేస్తుంది. అంతే కాక ఈ రాటిల్ స్నేక్కు రెండు తలలు ఉండటం మూలానా రెండు మెదళ్లు ఉంటాయి. దాంతో రెండు తలలు స్వతంత్రంగా ఆలోచిస్తాయి. అంటే ఒకే పాము విభిన్న ఆలోచనలన్న మాట. ఫలితంగా మెదడుతో మిగతా శరీరం సమన్వయం కాలేక దానిపై అదే దాడి చేసుకునే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇలాంటి జీవులు ఎక్కువ రోజులు బతకలేవు’ అన్నారు. ఇలా రెండు తలల పాములు కనిపించడం చాలా అరుదు. కవల పిల్లలు పూర్తిగా విడిపోకుండా దేహాలు కలిసిపోయి తలలు మాత్రమే వేరుగా ఏర్పడినప్పుడు ఇలాంటి వింత రూపంతో జీవులు జన్మిస్తుంటాయి. మనిషి శరీరాన్ని నియంత్రించేది మెదడు. అలాంటి మెదళ్లు రెండు ఉండి.. మిగిలిన శరీరం అంతా ఒక్కటిగానే ఉంటే... ఏ మెదడు ఇచ్చిన సంకేతాలను మొదట అనుసరించాలో తెలియక శరీర భాగాలు తికమకపడే ప్రమాదం ఉంటుంది. ఒక తల ఇటు వెళితే.. ఇంకో తల అటు వెళ్లడానికి సిద్ధమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క శరీరంతో రెండు తలలు ఇచ్చే సూచనలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం చాలా కష్టం. అలా చేయకపోతే అవి జీవించడం కూడా కష్టమవుతుంది. -
సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) బృందం కలిసింది. వెలగపూడిలోని అసెంబ్లీలో ముఖ్యమంత్రిని నాటా సభ్యులు ఆయన ఛాంబర్లో కలుసుకున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో న్యూజెర్సీలో జరిగే ‘నాటా’ మహాసభలకు రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు నాటా సభ్యులు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో నాటా కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, జాయింట్ ట్రెజరర్ మేకా శివ, ఇంటర్నేషన్ వైస్ ప్రెసిడెంట్ కిష్టపాటి రమణారెడ్డి, నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సాగంరెడ్డి అంజిరెడ్డి, ఇండియా కో–ఆర్డినేటర్ మల్లు ప్రసాదరెడ్డి ఉన్నారు. -
రోడ్డుపై నోట్ల వరద : జనం పరుగులు
అమెరికాలో అనూహ్యంగా చేతికి చిక్కిన క్యాష్తో కొంతమంది క్రిస్మస్కు ముందే సంబరాలు చేసుకున్నారు. అవును, ఒకపక్క మంచు వర్షం..మరోపక్క నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వరద కురుస్తోంటే.. ఆహా ఏమి నా భాగ్యమూ అంటూ జనం ఎగబడ్డారు. చేతికి దొరికినంతా దక్కించుకుని చెక్కేసారు. అమెరికాలోని న్యూజెర్సీ హైవేపై ఈ ఘటన జరిగింది. అటు ఈ ఘటనపై ట్విట్టర్లో వీడియోల వర్షం కురిసింది. దీంతో అయ్యో, సమయానికి తాము అక్కడ లేకపోయామే అంటూ మరికొంతమంది నెటిజన్లు వాపోయారు. సాయుధ పహరాతో వెళుతున్న ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బ్రింక్స్ వ్యాను తలుపులు ఆకస్మాత్తుగా తెరుచుకోవడంతో ఒక్కసారిగా రోడ్డు మీద కరెన్సీ వరద పారింది. దీంతో జనం ఉరుకులు పరుగులు తీశారు. విపరీతమైన రద్దీలో కూడా కార్లు ఎక్కడపడితే అక్కడ ఆపి మరీ నోట్లవేటలో పడ్డారు. దీంతో భారీ ట్రాఫిక్ జాం ..అంతేకాదు కొన్నివాహనాలు అదుపు తప్పి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. బ్రింక్స్ వ్యానులో నుంచి రెండు బ్యాగులు కిందపడిపోయి నోట్లు బయటకు వచ్చాయి. ఒక దాంట్లో 3.7 లక్షలు, మరోదాంట్లో 1.4 లక్షలు.. మొత్తం 5.1 లక్షల డాలర్లు ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. బ్రింక్స్ సిబ్బంది, దారినపోయేవారు కలిసి ఎట్టకేలకు సుమారు 2 లక్షల డాలర్లు అక్కడికక్కడే సేకరించారు. అలాగే కొంతమంది నిజాయితీపరులు తమకు దొరికిన నగదును పోలీసు స్టేషన్లో అప్పగించారు. అయితే ఇలా అందిన డబ్బు కేవలం 11 వేల డాలర్లేనట. దీంతో మిగిలిన సొమ్ము ఎలా తేవాలిరా బాబూ అని తలలు పట్టుకోవడం అధికారులు వంతు అయిందిట. -
అమెరికాలో కాల్పులు: ముగ్గురు వ్యక్తులు మృతి
న్యూజెర్సీ ఇర్వింగ్టన్లో ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో విషాదం చోటు చేసుకుంది. ఇర్వింగ్టన్లోని ఓ క్లబ్లో ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో క్లబ్ యజమాని కుమారుడితోపాటు ఉద్యోగి కూడా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. మరోకరని గుర్తించవలసి ఉందని తెలిపారు. తుపాకితో పాటు క్లబ్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన వ్యక్తిని క్లబ్ భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో ఆ వ్యక్తి ఆగ్రహంతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాల్పులు జరిపిన ఆగంతకుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు గురువారం వివరించారు. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.