భార్య, కుమార్తెతో మసూద్ అలీ (ఫైల్ ఫోటో)
న్యూ జెర్సీ: అనంతపురంకు చెందిన మసూద్ అలీ (40) నూజెర్సీలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. మసూద్‌కు భార్య ఆయేషా, ఏడేళ్ల కుమార్తె అర్షియా ఉన్నారు. అక్టోబర్ 1న అర్షియా పుట్టినరోజు సందర్భంగా బెలూన్ల కోసం ఆయన అపార్ట్‌మెంట్ బయటకు వచ్చారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మసూద్ అలీ పార్ధీవ దేహాన్ని భారతదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు చేసింది. H1 స్టేటస్ లో ఉన్న ఆయన .. తన భార్య, కూతురుతో కొద్ది నెలల క్రితమే భారత్ నుంచి నుండి వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: విద్యార్థులకు ‘గాటా’ చేయూత..
Comments
Please login to add a commentAdd a comment