ఘనంగా ముగిసిన నాటా సంబరాలు
డల్లాస్: నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) వారు నిర్వహించిన సంబరాలు ఘనంగా ముగిశాయి. వైఎస్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత విశేషాలను స్మరించుకుంటూ ఓ కార్యక్రమం నిర్వహించారు. 2016 ఏడాదికి గానూ వైఎస్ఆర్ అవార్డును డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డికి వైఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. కార్యక్రమ నిర్వాహకులు, నాటా అసోసియేషన్ సభ్యులు, అతిథులతో పాటు దాదాపు ఆరు వందలకు పైగా వైఎస్ఆర్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎ.రామిరెడ్డి వేదికపైకి పేరుపేరున అతిథులను ఆహ్వానించారు.
వైఎస్ఆర్ ఫౌండేషన్ సలహా మండలి చైర్మన్ ప్రేమ్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ తో తన కాలేజీ రోజులను, రాజకీయ నేతగా ఎదిగిన తర్వాత పేదవాళ్లకు చేసిన సేవలను కొనియాడారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఆయన కలిసిన వ్యక్తులను వారి సమస్యలతో సహా గుర్తుపెట్టుకున్నారని, ఎన్నో ప్రాజెక్టులను ఆయన చేపట్టారని పేర్కొన్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పెదల కష్టాన్ని, సమస్యలను గుర్తించి ముఖ్యంగా పేదల ఆరోగ్యం గురించి ఏదైనా చేయాలని ఎప్పుడూ తాపత్రయ పడేవారని గుర్తుచేసుకున్నారు. ప్రముఖ దినపత్రిక సాక్షి ఈడీ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఏ సందర్భంలోనూ జర్నలిస్టులను ప్రభావితం చేయాలని చూడలేదని, వారికి ఎంతో స్వేచ్ఛ ఇచ్చేవారని ఈ సందర్భంగా వెల్లడించారు. కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తనను ఇష్టపడే వారికి మాత్రమే కాదు తన రాజకీయ ప్రత్యర్థులకు కూడా సహాయం చేసిన గొప్పవ్యక్తి అని వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ
డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకరరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ జి. ప్రకాశ్ రావు, ఇతర ప్రముఖులను వేదికకు పరిచయం చేశారు. డాక్టర్ స్టాన్లీ రెడ్డి, కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ జి. రాఘవరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రమేశ్ అప్పారెడ్డి, వైఎస్ఆర్సీపీ అమెరికా కన్వీనర్లు గురువారెడ్డి, రాజ్ కేసిరెడ్డి, పి. రత్నాకర్, వెంకట మేడపాటి, వాసుదేవరెడ్డి, ఇతర ప్రముఖులు వేదికను పంచుకున్నారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ సెక్రటరీ అన్నారెడ్డి, కోశాధికారి విష్ణు కోటిమ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఇ.రఘురామి, సంయుక్త కోశాధికారి శరత్ మందపాటి, అంజన్ కర్నాతి, ద్వారక్ వారణాసి, కిరణ్ కందుల, మల్లికార్జున్ జెర్రిపోతుల, నంద గోపినాథ్, ప్రభాకర్ రెడ్డి, ఎ. రాజశేఖర్, పి. శ్రీకాంత్, సుధాకర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు
.