సాక్షి, హైదరాబాద్ : ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా)పై బుల్లితెర హాట్ యాంకర్, నటి రష్మిగౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో నాటా నిర్వహించే ఓ కార్యక్రమానికి తాను హాజరవుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేసుకుంటున్నారని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఈ విషయంలో తనని ఎవరు సంప్రదించలేదని, తన అనుమతి లేకుండా ఫొటో ఎలా వేస్తారని ప్రశ్నించారు.
ఇలా తన అనుమతి లేకుండా ఫొటోలు వేయడం ఇదే తొలి సారి కాదన్నారు. ఫొటోలు వేసేముందు అంగీకార పత్రాలను కూడా చూసుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫొటోలను గుర్తించిన కొందరు ట్విటర్‌లో తనకు ట్యాగ్ చేయడంతో తెలిసిందని పేర్కొన్నారు. ఇక నాటా నిర్వహించే ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్, డైరెక్టర్ శ్రీనువైట్లతో కలిసి రష్మి హాజరవుతున్నట్లు నిర్వాహకులు కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు.
How can they put me up here as a guest when no one even asked me in the very 1st place and this isn’t the 1st time y dont these organisations actually check for the official acceptance letter before putting the pics up can some one find and tag this association pic.twitter.com/DRFwldDyO2
— rashmi gautam (@rashmigautam27) May 20, 2018
@natatelugu to who so ever concern... no one approached me for this event and May I request the management to pls check with the artist for an official acceptance letter before starting the publicity @nriwala #nataconvention2018 pic.twitter.com/3KWd1tqxIE
— rashmi gautam (@rashmigautam27) May 20, 2018
Comments
Please login to add a commentAdd a comment