న్యూజెర్సీలోని అట్లాంటిక్‌లో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) బోర్డు సమావేశం జరిగింది. 2019-20 ఏడాదికిగానూ నూతన కార్యనిర్వాహక కమిటీని నియమించినట్టు నాటా ఓ ప్రకటనలో పేర్కొంది. గంగసాని రాజేశ్వర్ రెడ్డి అధ్యక్ష బాధ్యతలని కొత్తగా ఎంపికైన డా. రాఘవరెడ్డి గోసలకి అప్పగించారు. రెండేళ్లకోసారి జరిగే నాటా కన్వెన్షన్‌ని 2020లో అట్లాంటిక్ నగరంలో నిర్వహించాలని నిర్ణయించారు.