'జీవితమంతా మోసాలేనా.. కాస్త మారండి' | laxmi parvathi takes on chandrababu | Sakshi
Sakshi News home page

'జీవితమంతా మోసాలేనా.. కాస్త మారండి'

Published Tue, Oct 13 2015 7:12 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'జీవితమంతా మోసాలేనా.. కాస్త మారండి' - Sakshi

'జీవితమంతా మోసాలేనా.. కాస్త మారండి'

సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికీ, అధికారంలో ఉన్న పార్టీకే మంచి ప్రయోజనం. అయినా వాళ్లు గట్టిగా కేం ద్రాన్ని అడగలేకపోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఎంతో బాధ్యతతో ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న జగన్ కోమాలోకి వెళ్లే పరిస్థితి ఉంటే.. ఆయనకేదో మంచి పేరు వస్తుందన్న దుగ్ధతో దీక్షపైనే ప్రజలలో అనుమానాలు కలిగించడానికి ఈ సీఎం, మంత్రులు నీచమైన ఆలోచనలు చేయడం దుర్మార్గం’’ అని వైఎస్సార్‌సీపీ నాయకురా లు నందమూరి లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు.

ఆ మె సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు జీవితమంతా మాయ మాటలతో మాయ చేస్తూనే వస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌ను మోసం చేశారు. మొన్నటి ఎన్నికల ముందు ప్రజలకు మోసపు మాటలు చెప్పే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత చేపట్టిన దీక్ష విషయంలో ప్రజల తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. ఇలా ఇంకెంతకాలం బతుకుతారో ఏమో’’ అని విమర్శించారు. ఇప్పటికైనా కొంచెం మారి, మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటే కనీసం ఎన్టీఆర్ ఆత్మయినా శాంతిస్తుందని సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement