
ఎన్టీఆర్‌కు భారతరత్నను అడ్డుకున్నది బాబే!
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిల బెట్టిన ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. గతంలో తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నించలేదని విమర్శించారు. మంగళవారం ఢిల్లీవచ్చిన లక్ష్మీపార్వతి ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు.