ఇదీ మా అల్లుడు 'బాబు' ఘనచరిత్ర
గుంటూరు: అల్లుడి ఘన చరిత్ర తెలియాలంటే.. అత్తనే అడగాలని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి అన్నారు. చంద్రబాబు నాయుడికి సంబంధించిన పలురహస్యాలను ఆమె 'సమర దీక్ష' వేదికగా ఆమె బయటపెట్టారు. 10 లక్షలు తీసుకుని ఎన్టీ రామారావు కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడని ఆమె చెప్పారు. ఒకటో తరగతిలో ఉండగానే పక్కన పిల్లాడి దగ్గర బలపం కొట్టేశాడని, అప్పుడు వాళ్ల టీచర్ కొట్టారని ఆమె తెలిపారు.
కేజీ బేసిన్లో ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ నిక్షేపాలు బయటపడినప్పుడు రిలయన్స్తో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 34 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నాడని లక్ష్మీపార్వతి వెల్లడించారు. దీంట్లో 30 వేల కోట్లు మోదీకి పంపాలి, 4 వేల కోట్లు ఉంచుకుంటానన్నాడు. కానీ చివరికి 4 వేలకోట్లు గుజరాత్కి పంపి, 30 వేలకోట్లు తను ఉంచుకున్నాడని చెప్పారు. అల్లుడు చరిత్ర అత్తకే కదా తెలిసేది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమర దీక్ష రెండోరోజున చంద్రబాబుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. వెధవా నువ్వు చేస్తున్నది పనికిమాలిన పని అని టీచర్లు గానీ, తల్లి గానీ ఎవరో ఒక్కరైనా చెప్పి ఉంటే రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం పట్టి ఉండేది కాదు అని చంద్రబాబుపై లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
ఆమె ఇంకా ఏమన్నారంటే..
''ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పని రహస్యాలు నాకు తెలుసు. వీడు ఒకటో క్లాసు చదువుకునేటప్పుడే పక్క పిల్లల బలపాలు కాజేసి టీచర్ దగ్గర దెబ్బలు తిన్నాడు. కాలేజీకి వచ్చాక క్లాస్మేట్ల జేబుల్లో డబ్బులు కాజేసి రెండుసార్లు పోలీసు స్టేషన్లకు వెళ్లాడు. తర్వాత ఎన్టీఆర్ 10 లక్షలిస్తే.. కూతురిని పెళ్లి చేసుకుని అల్లుడైపోయాడు.
ఈ వేదిక మీద ఆకలి కేకలున్నాయి.. ఆ వేదిక మీద అధికార కాంక్షలున్నాయి. ఈ వేదిక మీద సింహం ఉంది. అక్కడేమో నక్కలున్నాయి. మా అల్లుడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. చాలా బాధపడుతున్నాను.. ఇంత మొద్దోడు అనుకోలేదు. ప్రజాబ్యాలెట్లో వందకి సున్నా మార్కులు తెచ్చుకున్నవాడిని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నాకైతే, రెండు మొట్టికాయలు మొట్టి వెధవా.. బాగా చదువు అని చెప్పాలనిపిస్తోంది. చంద్రబాబుకు జరిగిన అవమానానికి సంతాపం తెలియజేస్తున్నాను. మనవడైనా గట్టివాడు ఉంటాడేమో అనుకుంటే.. అబ్బిగాడికి అబ్బిగాడే పుడతాడని తేలింది. ఒబామాతో ఫొటో దిగడానికి 6 లక్షలు ఖర్చుపెట్టాడు. మా మనవడు లోకేశ్.. ఒబామాకే స్మార్ట్ సిటీలు ఎలా ఉండాలో చెప్పాడని బిల్డప్పిచ్చారు. తండ్రికి తగ్గ కొడుకే పుట్టాడని అప్పుడు అనుకున్నాను.''