‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారు. కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నాడు’ అని స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ‘ఎన్టీఆర్ భార్యగానే వచ్చాను. రాజకీయాలు చేయడానికి కాదు’ అని స్పష్టం చేశారు.