ప్రతిసినిమాలో కొత్తకోణం
బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో తారకరత్న
కర్నూలు సీక్యాంప్: నందమూరి కుటుంబ హీరోలకు కర్నూలు అచ్చొచ్చిన ప్రాంతమని, ఇక్కడ తమ ప్రతి సినిమా బాగా అడుతుందని నందమూరి తారకరత్న అన్నారు. నందమూరి బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని హోటల్ ప్రకాశ్ రిజెన్సీలో ఎన్‌బీకే మోక్షాజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో కేకు కట్ చేశారు. కార్యక్రమానికి అతిథిగా హాజరైన తారకరత్న మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో బాబాయ్ బాలకృష్ణది ప్రత్యేకశైలి అన్నారు. ప్రతీ సినిమాను కొత్త కోణంలో తీయడం ఆయనకే చెల్లుతుందన్నారు. తన అభిమాన హీరో బాలకృష్ణ అని, ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆ సేవా సమితి సభ్యులు లతీఫ్, ఖాజామిన్నెల్ల, రమేష్‌రెడ్డి, మోతీలాల్, లక్ష్మీనారాయణ, చంద్ర, రమేష్, రామకృష్ణ, సలాం, బజారి తదితరులు పాల్గొన్నారు.