Taraka Ratna Health: MP Vijayasai Reddy Visited Taraka Ratna At Bangalore Hospital - Sakshi
Sakshi News home page

మెరుగవుతోన్న తారకరత్న ఆరోగ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి

Published Wed, Feb 1 2023 6:45 PM | Last Updated on Thu, Feb 2 2023 8:24 AM

MP Vijayasai Reddy Visited Taraka Ratna At Bangalore Hospital - Sakshi

సాక్షి, బనశంకరి: నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, రాజ్య­సభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులో నారాయణ హృదయాల­య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజ­యసాయిరెడ్డి పరామర్శించారు.

తారకరత్న ఆ­రోగ్య ప­రిస్థితి గురించి వైద్యులను  అడిగి తెలుసుకు­న్నా­రు. తారకరత్న కుటుంబసభ్యులకు ధైర్యం చె­ప్పారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మా­ట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలక­డగా ఉంది.. పురోగతి కనిపిస్తోందని తెలిపా­రు.  డా­క్టర్లు మంచి చికిత్స అందిస్తున్నారని, బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారని చెప్పారు.

తారకరత్నకు గుండెపోటు వచ్చిన 45 ని­మి­షాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇవాళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. గుండెతో పా­టు రక్తప్రసరణ బాగుందని, రేపటి కల్లా మరింత మె­రుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.   

చదవండి: నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement