bangalore hospital
-
మెరుగవుతోన్న తారకరత్న ఆరోగ్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, బనశంకరి: నందమూరి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం బెంగళూరులో నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్న కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది.. పురోగతి కనిపిస్తోందని తెలిపారు. డాక్టర్లు మంచి చికిత్స అందిస్తున్నారని, బాలకృష్ణ అక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారని చెప్పారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిన 45 నిమిషాల పాటు మెదడుకు రక్తప్రసరణ ఆగిపోవడం వల్ల నరాలు కాస్త దెబ్బతిన్నాయని, ఇవాళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు. గుండెతో పాటు రక్తప్రసరణ బాగుందని, రేపటి కల్లా మరింత మెరుగవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: నాకు తెలిసిన బ్రహ్మనందం ఓ లెక్చరర్: మెగాస్టార్ -
చికిత్స పొందుతూ బాలిక మృతి
చిలమత్తూరు : ఆత్మహత్యకు పాల్పడిన బాలిక బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. వివరాలు.. మండల కేంద్రంలోని బ్రాహ్మణవీధికి చెందిన రోషన్, షకీలా దంపతుల పెద్ద కుమార్తె హర్షియాబాను (13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పి భరించలేక సోమవారం ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకుంది. గమనించిన బంధువులు, తల్లిదండ్రులు గాయపడ్డ హర్షియాను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మతి చెందింది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జమాల్‌బాషా వివరించారు. -
వేళ్లు నలిగాయని వెళ్తే.. కోమాలోకి పంపారు!
స్కూల్లో దెబ్బ తగిలి వేళ్లు నలిగాయని ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ ఆపరేషన్‌లో వైద్యులు చేసిన పొరపాటు వల్ల ఐదేళ్ల పిల్లాడు కోమాలోకి వెళ్లిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ కోమాలోకి వెళ్లాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షయ్ (5) అనే తన కొడుక్కి వేళ్లు నలిగాయని స్కూలు నుంచి ఫోన్ వచ్చిందని, వాళ్లు తనను ఆస్పత్రికి రమ్మని చెప్పారని అతడి తండ్రి పురుషోత్తం తెలిపారు. ఆస్పత్రికి వెళ్లేసరికి లక్షయ్ వేళ్లు బాగా నలిగిపోయి ఉండటం చూశానన్నారు. ఆరు గంటల్లోగా ఆపరేషన్ చేయాలని, అందుకోసం వెంటనే రూ. 60 వేలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేసినట్లు ఆయన తెలిపారు. సరే కదా అని ఆపరేషన్‌కు అంగీకరించామని, కొన్ని గంటల తర్వాత వైద్యులు వచ్చి లక్షయ్‌కి గుండెల్లో ఏదో సమస్య ఉందని చెప్పారన్నారు. ఆపరేషన్‌కు ముందువరకు ఎంచక్కా ఉన్న తన కొడుక్కి అంతలోనే ఏమైందోనని ఆందోళన చెందామన్నారు. తర్వాత ఉన్నట్టుండి మళ్లీ వచ్చి అతడు కోమాలోకి వెళ్లినట్లు చెప్పారని, గత తొమ్మిది రోజులుగా తమ బిడ్డ కోమాలోనే ఉన్నాడని పురుషోత్తం ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి వర్గాలు కనీసం అతడు ఎలా ఉన్నాడన్న విషయం కూడా తమకు చెప్పడం లేదని తెలిపారు. -
గ్రామస్తుల ఎదురుదాడి.. పోలీసులకు తీవ్రగాయాలు
ఆంధ్రా - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. విలాజిర్లా గ్రామంలో మట్కా స్థావరాల మీద పోలీసులు దాడులు చేశారు. అయితే, పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆ గ్రామస్తులు పోలీసులపై ఎదురు దాడికి దిగారు. దీంతో అనంతపురం జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో గాయపడిన పోలీసులను బెంగళూరు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.చిత్తూరు జిల్లాలో కూడా కొందరు స్మగ్లర్లు గతంలో పోలీసులు, అటవీ సిబ్బందిపై దాడి చేసిన విషయం తెలిసిందే.