Nayanthara and Vignesh Shivan Start Sending Wedding Invites - Sakshi
Sakshi News home page

నయన్‌-విఘ్నేష్‌ ఆహ్వానం అదిరింది

Published Sun, May 29 2022 4:46 AM | Last Updated on Sun, May 29 2022 2:46 PM

Nayanthara and Vignesh Shivan start sending wedding invites - Sakshi

హీరోయిన్‌ నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ తమ పెళ్లి షాపింగ్, ఆహ్వానపత్రికలు పంపడం, పెళ్లి వేడుకలకు సంబంధించిన ప్లాన్స్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు. జూన్‌ 9న ఈ ఇద్దరూ పెళ్లాడనున్నారు. బంధువులు, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరగనుంది. ఇప్పటికే కొందరు అతిథులకు ‘డిజిటల్‌ వీడియో ఇన్విటేషన్‌ కార్డ్‌’ని కూడా పంపించారట. ఆ వీడియో ఇన్విటేషన్‌ వైరల్‌గా మారింది.

ఈ పత్రిక ప్రకారం నయన–విఘ్నేష్‌ తమిళనాడులోని మహాబలిపురంలో పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పెళ్లి అని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహాబలిపురం అని ఇన్విటేషన్‌ స్పష్టం చేస్తోంది. ఓ రిసార్ట్‌లో ఈ వేడుక జరుగుతుందట. కాగా.. ఆకాశం, అందమైన ఇల్లు, చుట్టూ పచ్చని చెట్లతో డిజైన్‌ చేసిన డిజిటల్‌ ఇన్విటేషన్‌ కార్డ్‌ అదిరిందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement