రాష్ట్ర పరిశ్రమలు, ఐటీæ శాఖ మంత్రి కేటీఆర్‌కు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది మే 18, 19 తేదీల్లో జరిగే స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ వార్షిక సదస్సులో ఉపాధి–ఉద్యోగాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలపై ప్రసంగించాల్సిందిగా వర్సిటీ కోరింది. ఐటీ రంగంలో గత రెండున్నరేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకున్న అవకాశాలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేసింది.