చైనాకు రావాల్సిందిగా కేసీఆర్కు ఆహ్వానం
హైదరాబాద్: చైనాకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం అందింది. చైనాలోని సిచువాన్ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కు ఈ మేరకు లేఖ రాసింది. తెలంగాణ రాష్ట్రంతో వ్యాపార ఒప్పందాలు చేసుకునేందుకు సిచువాన్ ప్రావిన్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తెలంగాణతో విద్యుదుత్పత్తి పరికరాల ఒప్పందానికి సుముఖంగా ఉంది.