సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన బోస్టన్ యూనివర్సిటీలో వచ్చే సంవత్సరం జరిగే ఇండియా కాన్ఫరెన్స్‌లో మాట్లాడేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావుకు ఆహా్వనం అందింది. 2024 ఫిబ్రవరి 18న హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 21వ ఎడిషన్‌లో ఫైర్‌సైడ్ చాట్‌లో మాట్లాడేందుకు కేటీఆర్‌ను ఆహ్వానించారు. ‘ఇండియా రైజింగ్: బిజినెస్, ఎకానమీ, కల్చర్’అనే అంశంపై ఈ కాన్ఫరెన్స్ సాగనుంది.
‘ఇటీవలి కాలంలో తెలంగాణ సాధించిన వృద్ధిలో చూపిన ప్రభావవంతమైన నాయకత్వం, పోషించిన పాత్ర, తెలంగాణను పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా నిలబెట్టడం, మాకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’అని ఈ సందర్భంగా కేటీఆర్‌కు పంపిన ఆహా్వన లేఖలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం పేర్కొంది. విద్యార్థులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, నాయకులు, విధాన నిపుణులతో సహా 1,000 మంది భారతీయ ప్రవాస సభ్యులు ఈ సదస్సులో పాల్గొంటారు. కాగా, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment