అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య నగరంలోని ప్రధాన రహదారులను సూర్య స్తంభాలతో అలంకరించారు. నయా ఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో కలిపే ‘ధర్మ మార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు. ఆ వివరాలు..
నటీనటులు
1. అమితాబ్ బచ్చన్
2. మాధురీ దీక్షిత్
3. అనుపమ్ ఖేర్
4. అక్షయ్ కుమార్
5. రజనీకాంత్
6. సంజయ్ లీలా బన్సాలీ
7. అలియా భట్
8. రణబీర్ కపూర్
9. సన్నీ డియోల్
10. అజయ్ దేవగన్
11. చిరంజీవి
12. మోహన్ లాల్
13. ధనుష్
14. రిషబ్ శెట్టి
15. ప్రభాస్
16. టైగర్ ష్రాఫ్
17. ఆయుష్మాన్ ఖురానా
18. అరుణ్ గోవిల్
19. దీపికా చిఖలియా
వ్యాపారవేత్తలు
1. ముఖేష్ అంబానీ
2. అనిల్ అంబానీ
3. గౌతమ్ అదానీ
4. రతన్ టాటా
క్రీడాకారులు
1. సచిన్ టెండూల్కర్
2. విరాట్ కోహ్లీ
రాజకీయనేతలు
1. మల్లికార్జున్ ఖర్గే
2. సోనియా గాంధీ
3. అధిర్ రంజన్ చౌదరి
4. డాక్టర్ మన్మోహన్ సింగ్
5. హెచ్‌డి దేవెగౌడ
6. లాల్ కృష్ణ అద్వానీ
7. మురళీ మనోహర్ జోషి
Comments
Please login to add a commentAdd a comment