
కేటీఆర్‌కు స్టాన్‌ఫోర్డ్ నుంచి ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిశ్రమలు, ఐటీæ శాఖ మంత్రి కేటీఆర్‌కు అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఏడాది మే 18, 19 తేదీల్లో జరిగే స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ వార్షిక సదస్సులో ఉపాధి–ఉద్యోగాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంశాలపై ప్రసంగించాల్సిందిగా వర్సిటీ కోరింది. ఐటీ రంగంలో గత రెండున్నరేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి, టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించేందుకున్న అవకాశాలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేసింది.
ఈ సమావేశానికి వివిధ దేశాల నుంచి పరిశ్రమల ప్రతినిధులు హాజరవుతారని, వీరికి తెలంగాణ సాధించిన ప్రగతి ఒక కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని మంత్రికి పంపిన లేఖలో స్టాన్‌ఫోర్డ్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ అంజిని కొచ్చర్ పేర్కొన్నారు. గతేడాది కూడా ఆహ్వానం వచ్చిందని, వరుసగా రెండో ఏడాది తనకు ఆహ్వానం రావడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.