న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి అమెరికా నుంచి బదులు రాలేదు, కానీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గతేడాది జూన్‌లో వాషింగ్టన్‌లో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా భారత్‌లో పర్యటించాలని మోదీ ట్రంప్‌ను కోరారు. 2019 గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ట్రంప్‌కు తాజాగా ఆహ్వానం పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment