
మోడీకి ‘ప్రసంగ’ ఆహ్వానం
అమెరికా కాంగ్రెస్ సంయుక్త (సెనేట్, ప్రతినిధుల సభ) సమావేశంలో ప్రసంగించాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయినర్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పలికారు.
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్ సంయుక్త (సెనేట్, ప్రతినిధుల సభ) సమావేశంలో ప్రసంగించాలంటూ ప్రతినిధుల సభ స్పీకర్ జాన్ బోయినర్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పలికారు. వీలైన తేదీనే ప్రసంగించాలని కోరారు.
ఈ మేరకు మోడీకి జూలై 30వ తేదీతో ఓ లేఖ రాశారు. సెప్టెంబర్ చివరి వారంలో మోడీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే, అమెరికాలో నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరగనుండడం, ఉభయ సభల షెడ్యూల్‌పై స్పష్టత లేకపోవడంతో మోడీ ప్రసంగించే అవకాల్లేవని తెలుస్తోంది.