ఎంఎస్‌ఎంఈ అవార్డుల దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్: ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి (మినిస్టరీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్) ఎంఎస్‌ఎంఈ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏపీ, తెలంగాణలోని సంస్థలు ఈ నెల 16లోపుదరఖాస్తులు పంపవల్సిందిగా ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థ కోరుతోంది. అవుట్‌స్టాండింగ్ ఎంట్రప్రెన్యూర్, ప్రొడక్ట్/ప్రొసెస్ ఇన్నోవేషన్, లీన్ మాన్యూఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఫర్ సెలక్టడ్ ప్రొడక్ట్స్, ఎక్స్‌పోర్ట్ విభాగాల్లో జాతీయ స్థాయిఅవార్డులను ఇవ్వనుంది. నాలుగేళ్లు ఎంఎస్‌ఎంఈ రంగంలో ఉండి... ఉద్యోగ్ ఆధార్ మెమోరండం (యూఏఎం), ఎంఎస్‌ఎంఈ డేటాబేస్‌లో ఉన్నవారిని కనీస అర్హులుగా పరిగణిస్తోంది. మొదటి బహుమతి పొందిన వారికి రూ.లక్ష బహుమతిఉంటుందని ప్రకటించింది. పూర్తి వివరాలు ఠీఠీఠీ. ఛీఛిఝటఝ్ఛ. జౌఠి. జీn వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.