కుస్తీ పోటీలకు కారంపూడి విద్యార్థులు
కుస్తీ పోటీలకు కారంపూడి విద్యార్థులు
Published Sat, Sep 3 2016 10:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
కారంపూడి: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీలకు స్థానిక గురుకుల పాఠశాల విద్యార్థులు 17 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.సుధాకర్ శనివారం తెలిపారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మందడంలో శుక్రవారం అండర్14, 17 విభాగాలలో జిల్లా స్థాయి ఎంపికలు జరిగాయి. అండర్ 14 బాలుర ఫ్రీ స్టెయిల్ విభాగంలో ఇ.రవి, ఎ.అంజిబాబు, ఎల్.రాకేష్, జి.అభినవ్, జి.రామకృష్ణ, ఆర్.ఆంజనేయులునాయక్, జి.నరసింహారావు ఎంపికయ్యారు. అండర్ 17 బాలుర ఫ్రీ స్టెయిల్ విభాగంలో ఎం.నాగేంద్రబాబు, పి.రమేష్, జి.గోపయ్య, ఇ రాజేష్, అండర్ 17 బాలుర గ్రీకో రోమన్ స్టెయిల్‌లో కె.దిలీప్‌కుమార్, బి.అబేజ్, ఎం.వంశీ, ఎ.సిద్దార్ధ, ఎం.రత్నకుమార్, పి.నాగరాజు ఎంపికయ్యారు. వీరికి శిక్షణ ఇచ్చిన పీడీ జి.భూషణం, పీఈటీ శ్రీనివాసులు ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ జాన్‌వెస్లీ, ఉపాధ్యాయులు అభినందించారు.
Advertisement
Advertisement