విద్యార్థులకు చెస్ పోటీలు
విద్యార్థులకు చెస్ పోటీలు
Published Wed, Sep 14 2016 9:24 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
గుంటూరు స్పోర్ట్స్: రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోటో ఫెస్ట్–2016 కార్యక్రమంలో బుధవారం స్థానిక బృందావన్ గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్డేడియం నందు బాలబాలికలకు చెస్, క్యారమ్స్ పోటీలు నిర్వహించారు. వివిధ విద్యాసంస్థలకు చెందిన 400 మంది విద్యార్థులు పోటీలలో తలపడ్డారు. ఈ సందర్భంగా రోటో ఫెస్ట్ డైరెక్టర్ రోటేరియన్ అంకమ్మరావు మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ వరకు క్రీడా, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. రోటేరియన్లు శివప్రసాద్, లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్, కె.ఎస్.రమేష్, గాలి సుబ్బారావు, క్లబ్ కార్యదర్శి గడ్డిపాటి సుధాకర్ పోటీలను పర్యవేక్షించారు.
Advertisement
Advertisement