తల్లిదండ్రుల ప్రోత్సాహం శుభపరిణామం | chess competitions | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రుల ప్రోత్సాహం శుభపరిణామం

Published Sat, Oct 8 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

chess competitions

రాజమహేంద్రవరం సిటీ : 
క్రీడలపై చిన్నా రుల ఆసక్తిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమని డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరంలోని షెల్టాన్‌ హోటల్లో 46వ జాతీయ జూనియర్‌ ఓపెన్‌ చదరంగం, 31వ జాతీయ జూనియర్‌ బాలికల చదరంగం చాంపియన్‌ షిప్‌–2016 పోటీలు శనివారం మొదలయ్యాయి. జాతీయ క్రీడాకారిణి జి.హర్షితతో మొదటి ఆట ఆడి టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, అసెంట్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా చదరంగం సంఘం సహకారంలో తొమ్మిది రోజులు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. రాష్ట్ర చదరంగం సంఘం అధ్యక్షుడు వైడీ రామారావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 200 మంది క్రీడాకారులు హజరయ్యే ఈ టోర్నీలో తొమ్మిది రోజుల్లో 11 రౌండ్లు జరుగుతాయన్నారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున ఆడతారన్నారు. అసెంట్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ నిర్వాహకురాలు, టోర్నీ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీదేవి మాట్లాడుతూ 30 మంది క్రీడాకారులకు రెండున్నర లక్షల నగదు బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, చైతన్యరాజు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement