సందడిగా బ్యాడ్మింటన్ పోటీలు
సందడిగా బ్యాడ్మింటన్ పోటీలు
Published Tue, Oct 25 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
తెనాలి: ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన వేదికపై ప్రారంభసభ నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతిని వెలిగించగా, ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పావురాలు, బెలూన్లను ఎగురవేశారు. జ్యోతిని సుంకర హరికృష్ణ, గడ్డిపాటి బాలచంద్రకుమార్ వెలిగించారు. తొలుత క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డీవో జి.నరసింహులు, డీఎస్పీ జీవీ రమణమూర్తి, కె.శకుంతల పాల్గొన్నారు. అనంతరం వివిధ జిల్లాల్నుంచి వచ్చిన క్రీడాకారులకు క్వాలిఫైయింగ్ పోటీలను నిర్వహించారు. అండర్–13 విభాగంలో బాలురు 90 మంది, బాలికలు 38 మంది రాగా, అండర్ –15 విభాగంలో బాలురు 110 మంది, బాలికలు 34 మంది వచ్చారు. వీరందరికి క్వాలిఫైయింగ్ పోటీలతోనే తొలిరోజు గడచిపోయింది. బుధవారం మధ్యాహ్నానికి వీరిలో క్వాలిఫైయింగ్ క్రీడాకారులు తేలిపోతారు. క్వాలిఫై అయిన క్రీడాకారులతో డ్రాలు తీసి, సాయంత్రం నుంచి పోటీలు ఆరంభమయ్యే అవకాశముంది.
Advertisement
Advertisement