march fast
-
ఫ్లాగ్ మార్చ్‌లో రికార్డు!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సందర్భంలో బందో బస్తు, భద్రత ఏర్పాట్లలో భాగంగా ఫ్లాగ్‌మార్చ్‌ల పేరిట పోలీసు, సాయుధ బలగాల కవాతులు నిర్వహించడం పరిపాటే. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ అధికారులు కొత్త రికార్డు సృష్టించారు. కమిషనర్ మహేష్ మురళీధర్ భగవత్ నేతృత్వంలో సుదీర్ఘ ఫ్లాగ్‌మార్చ్‌ను మంగళవారం నిర్వహించారు. మూడు పోలీసుస్టేషన్ల పరిధిలో మొత్తం 5 కి.మీ. మేర ఈ కవాతు జరిగింది. కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇంత దూరం జరగడం పోలీసు చరిత్రలో ఇదే తొలిసారి. కుషాయిగూడ, నేరేడ్మెట్, జవహర్‌నగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నాలుగు వార్డుల్లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలను కవర్ చేస్తూ ఈ ఫ్లాగ్‌మార్చ్ జరిగింది. ఇందులో 129 మంది సివిల్ పోలీసులు, 212 మంది టీఎస్ఎస్పీ, ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ రోజున ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఈ బలగాలు విధులు నిర్వర్తించనున్నాయి. పోలీసు బ్యాండ్, అశ్వకదళాలు ఈ కవాతును ముందుకు నడిపించాయి. ప్రజల్లో స్థైర్యం నింపేందుకే : మహేశ్ భగవత్ స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఫ్లాగ్‌మార్చ్ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రజల్లో నైతిక స్థైర్యం నింపడానికి ఈ ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించామని పేర్కొన్నారు. ఫ్లాగ్‌మార్చ్‌లో మల్కాజ్గిరి డీసీపీ రక్షిత మూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీ ప్రదర్శనకు బ్రేక్ : బెంగాల్లో ఉద్రిక్తత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ కార్యకర్తల మృతికి నిరసనగా బీజేపీ నేతలు బసిర్హాట్ నుంచి కోల్‌కతాకు చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ ప్రదర్శనను అడ్డుకోవడంపై ఆగ్రహించిన బీజేపీ సోమవారం బసిర్హాట్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. పార్టీ ఎంపీ దిలీప్ ఘోష్, హుగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ నేతలు రాహుల్ సిన్హా తదితరుల నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులు వెంటరాగా ప్రదర్శన ముందుకుసాగింది. ఘర్షణలో మృతిచెందిన పార్టీ కార్యకర్తల మృతదేహాలను కోల్‌కతా పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళుతున్న వాహనాలను సైతం పోలీసులు అడ్డగించారు. శాంతిభద్రతల సమస్య కారణంగా కోల్‌కతాకు ప్రదర్శనను అనుమతించబోమని పోలీసులు బీజేపీ నేతలకు తెలపడంతో పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు. -
కేంద్ర బలగాల మార్చ్ఫాస్ట్..
సాక్షి, గుంటూరు : నగరంలో కేంద్ర బలగాల ఆదివారం మార్చ్ఫాస్ట్ చేశాయి. నగర వాసులు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అర్బన్ జిల్లా పరిధిలో విధులు నిర్వహించేందుకు కేంద్ర పాలమిలటరీ బలగాలు ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేశాయి. ఆయన ఆదేశాల మేరకు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి హిందూ కళాశాల కూడలి నుంచి శంకర్ విలాస్, లక్ష్మీపురం, పట్టాభిపురం, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు మార్చ్ఫాస్ట్ నిర్వహించాయి. అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో బలగాలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. షిప్టుల వారీగా విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కమాండోలు సహకారం అందించాలని సూచించారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందస్తు చర్యలు పూర్తి చేశామని వివరించారు. డీఎస్పీలు నజీముద్దీన్, కులశేఖర్, నారాయణరావు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సందడిగా బ్యాడ్మింటన్ పోటీలు
తెనాలి: ఆంధ్రప్రదేశ్ బాలబాలికల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం ఇక్కడి ఇండోర్ స్టేడియంలో పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన వేదికపై ప్రారంభసభ నిర్వహించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జ్యోతిని వెలిగించగా, ప్రభుత్వ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం పోటీలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పావురాలు, బెలూన్లను ఎగురవేశారు. జ్యోతిని సుంకర హరికృష్ణ, గడ్డిపాటి బాలచంద్రకుమార్ వెలిగించారు. తొలుత క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డీవో జి.నరసింహులు, డీఎస్పీ జీవీ రమణమూర్తి, కె.శకుంతల పాల్గొన్నారు. అనంతరం వివిధ జిల్లాల్నుంచి వచ్చిన క్రీడాకారులకు క్వాలిఫైయింగ్ పోటీలను నిర్వహించారు. అండర్–13 విభాగంలో బాలురు 90 మంది, బాలికలు 38 మంది రాగా, అండర్ –15 విభాగంలో బాలురు 110 మంది, బాలికలు 34 మంది వచ్చారు. వీరందరికి క్వాలిఫైయింగ్ పోటీలతోనే తొలిరోజు గడచిపోయింది. బుధవారం మధ్యాహ్నానికి వీరిలో క్వాలిఫైయింగ్ క్రీడాకారులు తేలిపోతారు. క్వాలిఫై అయిన క్రీడాకారులతో డ్రాలు తీసి, సాయంత్రం నుంచి పోటీలు ఆరంభమయ్యే అవకాశముంది. -
త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలి
– ఇతర ధార్మిక సంస్థలకు టీటీడీ ఆదర్శంగా నిలవాలి – స్వాతంత్య్ర వేడుకల్లో టీటీడీ ఈవో తిరుపతి అర్బన్: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలనే త్యాగం చేసిన త్యాగధనుల ఫలాలు అందరికీ అందాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు కాంక్షించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం టీటీడీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈవో టీటీడీ భద్రతా దళాల కవాతును తిలకించి, గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగఫలంగా వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సామాన్య భక్తులు కూడా శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనడమే గాక పారదర్శకత పెంచేందుకు వీలుగా ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవా టికెట్లను ఇంటర్నెట్లో విడుదల చేస్తున్నామని తెలిపారు. రూ.300 ప్రత్యేక దర్శనం భక్తుల కోసం ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయిందన్నారు. రెండో దశలో దివ్యదర్శనం(కాలి నడకన వచ్చే) భక్తులకు మెరుగైన వసతులతో కూడిన కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని లడ్డూ కౌంటర్ల వద్ద 2 గ్రాముల శ్రీవారి బంగారు, వెండి, రాగి డాలర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. కాషన్ డిపాజిట్లు లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి చేయూత ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామన్నారు. టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. భజన మండళ్ల సంఖ్యను పెంచడం ద్వారా నాటక రంగానికి చేయూతనిస్తున్నట్లు తెలిపారు. స్విమ్స్, బర్డ్ ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, కళా బృందాల నృత్యాలు, టీటీడీ సెక్యూరిటీ గార్డు తిరుపాల్ ప్రదర్శించిన మ్యాజిక్ షో ఆకట్టుకున్నాయి. 202 మందికి ఉత్తమ సేవల ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ డీఈవో విజయకుమార్, ఎఫ్ఏ అండ్ సీఏవో బాలాజీ, లా ఆఫీసర్ వెంకటరమణ, డిప్యూటీ ఈవోలు చెంచులక్ష్మి, చిన్నంగారి రమణ, విజయసారథి, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, భద్రతాధికారి శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.