
బెంగాల్‌లో ఉద్రిక్తత
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ కార్యకర్తల మృతికి నిరసనగా బీజేపీ నేతలు బసిర్హాట్ నుంచి కోల్‌కతాకు చేపట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తమ ప్రదర్శనను అడ్డుకోవడంపై ఆగ్రహించిన బీజేపీ సోమవారం బసిర్హాట్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. పార్టీ ఎంపీ దిలీప్ ఘోష్, హుగ్లీ ఎంపీ లాకెట్ ఛటర్జీ నేతలు రాహుల్ సిన్హా తదితరుల నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులు వెంటరాగా ప్రదర్శన ముందుకుసాగింది. ఘర్షణలో మృతిచెందిన పార్టీ కార్యకర్తల మృతదేహాలను కోల్‌కతా పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళుతున్న వాహనాలను సైతం పోలీసులు అడ్డగించారు. శాంతిభద్రతల సమస్య కారణంగా కోల్‌కతాకు ప్రదర్శనను అనుమతించబోమని పోలీసులు బీజేపీ నేతలకు తెలపడంతో పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు.