
నగరంలో మార్చ్‌ఫాస్ట్ చేస్తున్న స్థానిక, కేంద్ర పారామిలటరీ బలగాలు
సాక్షి, గుంటూరు : నగరంలో కేంద్ర బలగాల ఆదివారం మార్చ్‌ఫాస్ట్ చేశాయి. నగర వాసులు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అర్బన్ జిల్లా పరిధిలో విధులు నిర్వహించేందుకు కేంద్ర పాలమిలటరీ బలగాలు ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేశాయి. ఆయన ఆదేశాల మేరకు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి హిందూ కళాశాల కూడలి నుంచి శంకర్ విలాస్, లక్ష్మీపురం, పట్టాభిపురం, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వరకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించాయి.
అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో బలగాలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడారు. షిప్టుల వారీగా విధులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో కమాండోలు సహకారం అందించాలని సూచించారు. వారికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని చెప్పారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందస్తు చర్యలు పూర్తి చేశామని వివరించారు. డీఎస్పీలు నజీముద్దీన్, కులశేఖర్, నారాయణరావు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.