తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఆస్తి కేవలం రెండు ఎకరాలు మాత్రమే. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆస్తి ఎంతో తెలుసా? అక్షరాల లక్ష కోట్ల రూపాయలు. అవునండీ ఇదేదో రాజకీయ ఆరోపణ కాదు. ఏకంగా చంద్రబాబు నాయుడే స్వయంగా ఓ భారీ బహిరంగ సభలో ఒప్పుకున్న వాస్తవం. ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడివిట్‌లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తులు కేవలం 20 కోట్లు మాత్రమే. కానీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల విలువ లక్ష కోట్లు. ఆదివారం జరిగిన తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడూ గొప్పలకు ప్రాధాన్యత నిచ్చే చంద్రబాబు నైజమే అసలు నిజాన్ని బయటపెట్టేలా చేసింది. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.500 కోట్లు ఇద్దామని అనుకున్నారట. అయితే మోదీ మట్టి, నీరు తీసుకురావడంతో కేసీఆర్ 500 కోట్లు ఇస్తే బాగుండదని, మోదీ కొప్పడతారని చంద్రబాబుతో చెప్పారట. ఈ విషయాన్ని బహిరంగ సభలో నొక్కి చెబుతూ కేసీఆర్ ఇచ్చే 500 కోట్ల భిక్షం ఎవరికి కావాలి? నా ఆస్తి విలువే లక్ష కోట్లు అంటూ అసలు విషయం బయటపెట్టారు. తాను ప్రజల కోసమే పనిచేస్తానని, తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని ఇన్నాళ్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో తాను లక్ష కోట్లకు అధిపతిని అని ప్రకటించడంతో తెలుగు ప్రజలు అవాక్కయ్యారు. ఇదా చంద్రబాబు నాయుడి ముసుగు. చంద్రబాబు నాయుడు ఆవేశంలోనైనా తన ఆస్తి వివరాలు వెల్లడించారు. ఇక ముందు ముందు ఆయనను లక్షకోట్ల బాబు అని పిలవాల్సి ఉంటుందంటూ నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment