
ఇక రెండు రాష్ట్రాల్లో నాటక పోటీలు..
గత 24 ఏళ్లుగా పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరుచూరి రఘుబాబు నాటక స్మారక పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నాటక పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మేనేజింగ్ ట్రసీ ్ట పరుచూరి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో, మే 1 నుంచి 5 వరకు గుంటూరులో ఈ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు.