Paruchuri Raghu Babu
-
ఇక రెండు రాష్ట్రాల్లో నాటక పోటీలు..
గత 24 ఏళ్లుగా పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరుచూరి రఘుబాబు నాటక స్మారక పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నాటక పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మేనేజింగ్ ట్రసీ ్ట పరుచూరి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హైదరాబాద్లో, మే 1 నుంచి 5 వరకు గుంటూరులో ఈ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు. -
21 నుంచి పల్లెకోనలో నాటకోత్సవాలు
భట్టిప్రోలు, న్యూస్లైన్: గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు పరుచూరి రఘుబాబు స్మారక అఖిల భారత నాటకోత్సవాలు జరగనున్నాయి. రఘుబాబు మెమోరియల్ ట్రస్టీ, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గురువారం ‘న్యూస్లైన్’తో ఫోన్లో మాట్లాడుతూ, రఘుబాబు స్మారకంగా 2008 వరకు హైదరాబాద్లో ఈ నాటకోత్సవాలు నిర్వహించామన్నారు. అయితే గత నాలుగేళ్లుగా వీటిని పల్లెకోనలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటా ఏప్రిల్ 27 నుంచి 5 రోజులపాటు నాటకోత్సవాలు జరిగేవని, అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీటిని మే 21వ తేదీకి వాయిదా వేశామన్నారు. -
ఏప్రిల్లో పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు
వెండితెరకు రంగస్థలం అందించిన ప్రతిభామూర్తుల గురించి చెప్పుకుంటే... వారిలో పరుచూరి సోదరులు తప్పకుండా ఉంటారు. రంగస్థలంపై ఇప్పటికీ పరుచూరివారికి మమకారం తగ్గలేదు. అందుకే... రెండు దశాబ్దాలుగా పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు స్వర్గీయ పరుచూరి రఘుబాబు పేరిట నాటకోత్సవాలను నిర్వహిస్తూనే ఉన్నారు. పరుచూరి రఘుబాబు 24వ అఖిలభారత నాటకోత్సవాలను ఏప్రిల్ 27 నుంచి మే 1 వరకూ గుంటూరు జిల్లా పల్లెకోన గ్రామంలోని నందమూరి తారకరామారావు కళాప్రాంగణంలో ఘనంగా నిర్వహించనున్నారు పరుచూరి బ్రదర్స్. ఈ నాటక పరిషత్లో పోటీ చేయాలనుకుంటున్న నాటక సమాజాల వారు తమ పూర్తి వివరాలను అందించాల్సిందిగా శనివారం వారు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.