memorial trust
-
పాట్నాలో సుశాంత్ మెమోరియల్
‘‘సుశాంత్ మెరిసే కళ్లను మళ్లీ చూడలేమని, ఆ నవ్వులను ఇక వినలేమనే నిజాన్ని అంగీకరించలేకపోతున్నాం. సైన్స్ గురించి అతను చెప్పే విషయాలను ఇక వినలేమనే బాధ వెంటాడుతోంది. తన మరణం మా ఇంట్లో శాశ్వతమైన శూన్యాన్ని మిగిల్చింది’’ అని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నటుడు సుశాంత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను చనిపోయిన (జూన్ 14) 13 రోజులకు శనివారం సుశాంత్ కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘సైన్స్, స్పోర్ట్స్, సినిమా.. ఇలా సుశాంత్ బాగా ఇష్టపడిన ఈ రంగాల్లో ప్రతిభావంతులైన యువతీయువకులను ప్రోత్సహించడానికి ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్’ (ఎస్ఎస్ఆర్ఎఫ్) ఆరంభిస్తున్నాం. పాట్నాలో సుశాంత్ పుట్టి, పెరిగిన ఇంటిని ‘మెమోరియల్’గా మార్చుతున్నాం’’ అని ఆ ప్రకటనలో తెలిపారు. సుశాంత్ వాడిన టెలీస్కోప్, వేలాది పుస్తకాలు, అతని ఇతర విలువైన వస్తువులను మెమోరియల్‌లో ప్రదర్శనకు ఉంచుతామని, ఇకనుంచి అతని ఇన్స్టాగ్రామ్, ట్వీటర్, ఫేస్‌బుక్‌లను యాక్టివ్‌గా ఉంచుతూ, సుశాంత్ జ్ఞాపకాలు సజీవంగా ఉండేలా చేస్తామని కూడా పేర్కొన్నారు. -
బీమా ఉంటే... టూర్ ఓ జ్ఞాపకం!!
ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్ధమయ్యారా? అయితే ఇంకేం.. అన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ట్రావెల్ అంటే ఏదో బ్యాగ్ వేసుకొని వెళ్లిపోవడం కాదుగా? చాలా తతంగాలుంటాయి. అందులో అతిముఖ్యమైనది ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ కవర్. దీని కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ట్రావెల్ చేసేటప్పుడు ట్రిప్ రద్దవ్వడం, బ్యాగేజ్ తస్కరణ, ఊహించని ప్రమాదాలు, విదేశాల్లో పాస్‌పోర్ట్ కనిపించకుండా పోవడం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ మనకు భరోసానిస్తుంది. ట్రిప్ సాఫీగా జరిగి, అది ఒక జ్ఞాపకంగా నిలిచిపోతేనే ఆ ట్రావెల్ బాగా జరిగిందంటారు. ప్రయాణానికి రెడీ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వెళ్లేది కొత్త ప్రాంతానికి. అక్కడ వాతావరణం, ఆహారం ఎలా ఉంటుందో తెలియదు. టైమ్ బాగాలేకపోతే అక్కడ ఏమైనా జరగొచ్చు. కొన్నిసార్లు ఎక్కువ రోజులు ఉండాల్సి రావొచ్చు. వచ్చేటప్పుడు ఫ్లైట్ రద్దవొచ్చు. ఇలా అన్నింటికీ ప్రత్నామ్నాయం చేసుకోవాలి. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు.. పాలసీ ఎంపిక ఎలా? ►బెస్ట్ పాలసీ అంటే ఏమీ లేదు. మన అవసరాలన్నింటినీ తీర్చేదయితే అదే ఉత్తమ పాలసీ. ►మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటే మల్టిపుల్ ట్రిప్ పాలసీ తీసుకోండి. ► పాలసీలో వైద్య ఖర్చులు, బ్యాగేజ్ తస్కరణ, అత్యవసర తరలింపు వంటి అంశాలు కవర్ అవుతున్నాయో, లేదో చూడండి. సీనియర్ సిటిజన్స్, ట్రావెలర్లు ఏమైనా వైద్య సమస్యలు కలిగి ఉంటే అప్పుడు ప్రత్యేకమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ను ఎంపిక చేసుకోండి. ► పాలసీని ఎంపిక చేసుకునే ముందు అది మీరు వెళ్లే ప్రాంతానికి వర్తిస్తుందో లేదో తెలుసుకోండి. ►ఊహించని పరిస్థితుల్లో ఫ్లైట్ రద్దయినపుడు క్యాన్సిలేషన్ చార్జీలను కవర్ చేసే పాలసీని తీసుకోండి. ►కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉన్నప్పుడు జాగ్రత్త. ఇలాంటప్పుడు బ్యాగేజ్ కనిపించకుండా పోవచ్చు. లేదా రావడం ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ అంశం కూడా పాలసీలో కవర్ అయ్యేటట్లు చూడండి. ► పాలసీ తీసుకునే ముందు పాలసీ రివ్యూలను చదవండి. అలాగే పాలసీ ప్రీమియాన్ని ఇతర వాటితో పోల్చి చూసుకోండి. - ఆంటోనీ జాకబ్ అపోలో మ్యూనిక్ సీఈవో -
ఇక రెండు రాష్ట్రాల్లో నాటక పోటీలు..
గత 24 ఏళ్లుగా పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరుచూరి రఘుబాబు నాటక స్మారక పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నాటక పోటీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మేనేజింగ్ ట్రసీ ్ట పరుచూరి వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ నెల 27 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో, మే 1 నుంచి 5 వరకు గుంటూరులో ఈ పోటీలు జరగనున్నాయని ఆయన తెలిపారు. -
సుబ్రహ్మణ్యం సేవలు మరువలేనివి
వెంకటాచలం : డాక్టర్ పి. సుబ్రమణ్యం సేవలు మరువలేనివని సుబ్రమణ్యం మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఐఏస్‌అధికారి సుబ్రమణ్యం వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు. వెంకటాచలం మండలంలోని చెముడుగుంట పంచాయతీలో సుబ్రహ్మణ్యం ఘాట్ వద కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులు నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో మ్యాగీ సుబ్రమణ్యం, బేబి సంహిత, సధర్మ, డాక్టర్ కోటేశ్వరమ్మ, తిరుపయ్య,సుధాకర్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.