బీమా ఉంటే...  టూర్‌ ఓ జ్ఞాపకం!! | Tour is a memorial if insured | Sakshi
Sakshi News home page

బీమా ఉంటే...  టూర్‌ ఓ జ్ఞాపకం!!

Published Mon, Jun 11 2018 2:20 AM | Last Updated on Mon, Jun 11 2018 2:20 AM

Tour is a memorial if insured - Sakshi

ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్ధమయ్యారా? అయితే ఇంకేం.. అన్నీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ట్రావెల్‌ అంటే ఏదో బ్యాగ్‌ వేసుకొని వెళ్లిపోవడం కాదుగా? చాలా తతంగాలుంటాయి. అందులో అతిముఖ్యమైనది ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ కవర్‌. దీని కోసం ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ట్రావెల్‌ చేసేటప్పుడు ట్రిప్‌ రద్దవ్వడం, బ్యాగేజ్‌ తస్కరణ, ఊహించని ప్రమాదాలు, విదేశాల్లో పాస్‌పోర్ట్‌ కనిపించకుండా పోవడం, మెడికల్‌ ఎమర్జెన్సీ వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్‌ పాలసీ మనకు భరోసానిస్తుంది. ట్రిప్‌ సాఫీగా జరిగి, అది ఒక జ్ఞాపకంగా నిలిచిపోతేనే ఆ ట్రావెల్‌ బాగా జరిగిందంటారు. ప్రయాణానికి రెడీ అయ్యేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వెళ్లేది కొత్త ప్రాంతానికి. అక్కడ  వాతావరణం, ఆహారం ఎలా ఉంటుందో తెలియదు. టైమ్‌ బాగాలేకపోతే అక్కడ ఏమైనా జరగొచ్చు. కొన్నిసార్లు ఎక్కువ రోజులు ఉండాల్సి రావొచ్చు. వచ్చేటప్పుడు ఫ్లైట్‌ రద్దవొచ్చు. ఇలా అన్నింటికీ ప్రత్నామ్నాయం చేసుకోవాలి. అందుకే ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. దీనిని నిర్లక్ష్యం చేయొద్దు..

పాలసీ ఎంపిక ఎలా?
►బెస్ట్‌ పాలసీ అంటే ఏమీ లేదు. మన అవసరాలన్నింటినీ తీర్చేదయితే అదే ఉత్తమ పాలసీ. 
►మీరు ఎక్కువగా ట్రావెల్‌ చేస్తుంటే మల్టిపుల్‌ ట్రిప్‌ పాలసీ తీసుకోండి. 
► పాలసీలో వైద్య ఖర్చులు, బ్యాగేజ్‌ తస్కరణ, అత్యవసర తరలింపు వంటి అంశాలు కవర్‌ అవుతున్నాయో, లేదో చూడండి. సీనియర్‌ సిటిజన్స్, ట్రావెలర్లు ఏమైనా వైద్య సమస్యలు కలిగి ఉంటే అప్పుడు ప్రత్యేకమైన ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ను ఎంపిక చేసుకోండి. 
► పాలసీని ఎంపిక చేసుకునే ముందు అది మీరు వెళ్లే ప్రాంతానికి వర్తిస్తుందో లేదో తెలుసుకోండి.
►ఊహించని పరిస్థితుల్లో ఫ్లైట్‌ రద్దయినపుడు క్యాన్సిలేషన్‌ చార్జీలను కవర్‌ చేసే పాలసీని తీసుకోండి. 
►కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ ఉన్నప్పుడు జాగ్రత్త. ఇలాంటప్పుడు బ్యాగేజ్‌ కనిపించకుండా పోవచ్చు. లేదా రావడం ఆలస్యం కావొచ్చు. అందుకే ఈ అంశం కూడా పాలసీలో కవర్‌ అయ్యేటట్లు చూడండి.  
► పాలసీ తీసుకునే ముందు పాలసీ రివ్యూలను చదవండి. అలాగే పాలసీ ప్రీమియాన్ని ఇతర వాటితో పోల్చి చూసుకోండి.
- ఆంటోనీ జాకబ్‌
అపోలో మ్యూనిక్‌ సీఈవో   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement