అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ సంగీతోత్సవం.. తెలంగాన రాష్ట్రం హైదరాబాద్ నగరానికి రానుంది. ఈ విషయాన్ని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు, పేరొందిన అవుట్‌డోర్ మ్యూజిక్ ఫెస్టివల్.. ఇప్పుడు జిరో ఆన్ టూర్ పేరిట దేశవ్యాప్త టూర్‌కు సిద్ధమైందని, ఇందులో భాగంగా తమ తొలి ప్రదర్శనకు హైదరాబాద్ నగరాన్ని వేదికగా ఎంచుకుందని వివరించారు.
నగరంలోని తారామతి బారాదరిలో ఫిబ్రవరి 1 నుంచి 2 రోజుల పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకూ ఈ సంగీతోత్సవం కొనసాగుతుందన్నారు. ఈ సంగీతోత్సవంలో పంజాబీ ఫోక్ రాక్ గాయకుడు రబ్బీ షేర్‌గిల్, అరుణాచల్‌కు చెందిన ఇండీ ఆరి్టస్ట్ తాబా చాకె, మణిపూర్ జానపద సంచలనం మంగ్‌కా, మిజోరమ్ నుంచి ప్రత్యేక హోమ్‌లతో పాటు దక్షిణాది సంగీత సంచలనాలు రామ్ మిరియాల, శక్తిశ్రీ గోపాలన్, చౌరాస్తా బ్యాండ్స్ పాల్గొంటున్నాయని, ఈ సంగీత పండుగకు గిటార్ ప్రసన్న, జ్యోతీ హెగ్డే, ఫ్లూటిస్ట్ జెఎ జయంత్, రెహ్మత్–ఎ–ముస్రాత్ ఖవ్వాలీలు మరో ఆకర్షణగా పేర్కొన్నారు. ఇవే కాకుండా స్థానిక చెఫ్స్, కళాకారులు, ఔత్సాహిక వ్యాపారులకు కూడా భాగం కల్పిస్తున్నామని, స్టోరీ టెల్లింగ్ సెషన్స్, వర్క్‌షాప్స్ ఉంటాయన్నారు.
(చదవండి: ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌కు పిలుపు..)
Comments
Please login to add a commentAdd a comment