music festivals
-
నగరంలో 'జిరో' ఫెస్టివల్..
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రసిద్ధ సంగీతోత్సవం.. తెలంగాన రాష్ట్రం హైదరాబాద్ నగరానికి రానుంది. ఈ విషయాన్ని నిర్వాహక సంస్థ ప్రతినిధులు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలకు, పేరొందిన అవుట్డోర్ మ్యూజిక్ ఫెస్టివల్.. ఇప్పుడు జిరో ఆన్ టూర్ పేరిట దేశవ్యాప్త టూర్‌కు సిద్ధమైందని, ఇందులో భాగంగా తమ తొలి ప్రదర్శనకు హైదరాబాద్ నగరాన్ని వేదికగా ఎంచుకుందని వివరించారు. నగరంలోని తారామతి బారాదరిలో ఫిబ్రవరి 1 నుంచి 2 రోజుల పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకూ ఈ సంగీతోత్సవం కొనసాగుతుందన్నారు. ఈ సంగీతోత్సవంలో పంజాబీ ఫోక్ రాక్ గాయకుడు రబ్బీ షేర్గిల్, అరుణాచల్‌కు చెందిన ఇండీ ఆరి్టస్ట్ తాబా చాకె, మణిపూర్ జానపద సంచలనం మంగ్కా, మిజోరమ్ నుంచి ప్రత్యేక హోమ్‌లతో పాటు దక్షిణాది సంగీత సంచలనాలు రామ్ మిరియాల, శక్తిశ్రీ గోపాలన్, చౌరాస్తా బ్యాండ్స్ పాల్గొంటున్నాయని, ఈ సంగీత పండుగకు గిటార్ ప్రసన్న, జ్యోతీ హెగ్డే, ఫ్లూటిస్ట్ జెఎ జయంత్, రెహ్మత్–ఎ–ముస్రాత్ ఖవ్వాలీలు మరో ఆకర్షణగా పేర్కొన్నారు. ఇవే కాకుండా స్థానిక చెఫ్స్, కళాకారులు, ఔత్సాహిక వ్యాపారులకు కూడా భాగం కల్పిస్తున్నామని, స్టోరీ టెల్లింగ్ సెషన్స్, వర్క్‌షాప్స్ ఉంటాయన్నారు. (చదవండి: ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్‌కు పిలుపు..) -
నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం
‘‘నేను నటుణ్ణి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడికెళ్లినా మీరు (ఫ్యాన్స్) సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘డియర్‌కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్స్ సక్సెస్ అయ్యాయి. నేను నాలా ఉండటమే మీ అందరికీ నచ్చుతుంది’’ అని విజయ్‌దేవరకొండ అన్నారు. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘డియర్‌కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భరత్ నాకు చాలా కాలంగా తెలుసు. మూడేళ్లుగా నా సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్ చూశాడు. ఇప్పుడు ఒక అందమైన సినిమా నాకు ఇచ్చాడు. తను ఒక బ్రిలియంట్ డైరెక్టర్ అవుతాడు. ఈ సినిమా నా డియర్ కామ్రేడ్స్ అందరికీ, భరత్ కమ్మ వాళ్ల నాన్నగారికి అంకితం. లిల్లీ పాత్రలో రష్మిక ఎంత కష్టపడిందో సినిమా చూస్తే తెలుస్తుంది’’ అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ మా సినిమాని ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా’’ అన్నారు వై. రవిశంకర్. ‘‘భరత్ కమ్మ అండ్ టీమ్ ఒకటిన్నర సంవత్సరం ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించినందుకు థ్యాంక్స్’’ అన్నారు యష్ రంగినేని. ‘‘మా సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు నవీన్ ఎర్నేని. ‘2017లో ఎడిట్ రూమ్‌లో ‘పెళ్ళిచూపులు’ సినిమా చూశాను.. చాలా నచ్చింది. ‘అర్జున్ రెడ్డి’ టైమ్‌లో ‘డియర్ కామ్రేడ్’ కథ చెప్పాను. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవడానికి కారణం విజయ్ వాళ్ల నాన్నగారు. ‘డియర్ కామ్రేడ్’ తప్పకుండా మంచి హిట్ అవుతుంది’’ అని భరత్ కమ్మ అన్నారు. ‘‘భరత్ సార్ పంపిన ఈ కథ పిచ్చిగా నచ్చింది. మా పేరెంట్స్ వద్దన్నా ఈ సినిమా కోసం పెద్ద ఫైట్ చేయాల్సి వచ్చింది. క్రికెట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎన్నో గాయాలైనా లెక్క చేయకుండా ఈ సినిమా చేశా. విజయ్ అమేజింగ్ యాక్టర్’’ అన్నారు రష్మికా మండన్న. -
మ్యూజిక్ ఫెస్టివల్స్‌లో డ్రగ్స్ మామూలే: గోవా మంత్రి
పణజీ: మ్యూజిక్ ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు మద్యం, మాదక ద్రవ్యాలను వినియోగించడం మామూలేనని గోవా పర్యాటక మంత్రి దిలీప్ పరులేకర్ ఆదివారం అన్నారు. గోవాలో జరిగిన సన్‌బర్న్ ఫెస్టివల్లో కార్యక్రమం జరుగుతున్న చోటే శనివారం ఒక యువకుడు మాదకద్రవ్యాలతో పట్టుబడ్డాడు. మంత్రి పరులేకర్ మాట్లాడుతూ, మద్యం, మాదకద్రవ్యాలు లేకుండా మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను ఆస్వాదించలేమని వాటిలో పాల్గొనేవారు భావిస్తుంటారని, ఇందుకు నిర్వాహకులను తప్పుపట్టాల్సిన పనిలేదన్నారు.