సుబ్రహ్మణ్యం సేవలు మరువలేనివి | Subrahmanyam services | Sakshi
Sakshi News home page

సుబ్రహ్మణ్యం సేవలు మరువలేనివి

Published Wed, Sep 3 2014 2:06 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM

Subrahmanyam services

వెంకటాచలం :  డాక్టర్ పి. సుబ్రమణ్యం సేవలు మరువలేనివని సుబ్రమణ్యం మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన  ముఖ్య కార్యనిర్వహణాధికారి, ఐఏస్‌అధికారి సుబ్రమణ్యం వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్నారు.
 
 వెంకటాచలం మండలంలోని చెముడుగుంట పంచాయతీలో సుబ్రహ్మణ్యం ఘాట్ వద కుటుంబసభ్యులు, అభిమానులు, స్నేహితులు నివాళులు అర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో మ్యాగీ సుబ్రమణ్యం, బేబి సంహిత, సధర్మ, డాక్టర్ కోటేశ్వరమ్మ, తిరుపయ్య,సుధాకర్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement